సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి విన్నపాలు..

సీఎం కేసీఆర్ అంటే అగ్గి మీద గుగ్గిలం అయ్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. తాజాగా సీఎంకు విన్నపాలతో కూడిన ఓ లేఖ రాశారు.

news18-telugu
Updated: March 25, 2020, 8:02 AM IST
సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి విన్నపాలు..
సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
సీఎం కేసీఆర్ అంటే అగ్గి మీద గుగ్గిలం అయ్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. తాజాగా సీఎంకు విన్నపాలతో కూడిన ఓ లేఖ రాశారు. కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఓ కీలక ప్రతిపాదన చేశారు. జైళ్లలో ఉంటున్న ఖైదీలను విడుదల చేయాలని కోరారు. జైలు అధికారులు జైళ్లలోకి, బయటికి వస్తుంటారని.. వారి వల్ల ఖైదీలకు కరోనా సోకే ప్రమాదం పొంచి ఉందని.. అందువల్ల ఖైదీల విడుదల ఆలోచన చేయాలని విన్నవించారు. ముఖ్యంగా, మహిళలు, వృద్ధుల పట్ల సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని, సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో మొత్తం 5 లక్షల మంది ఖైదీలు ఉన్నారని, అందులో 65 శాతం మంది ట్రయల్స్‌లో ఉన్నవారేనని చెప్పారు. శిక్ష కాలం ముగుస్తున్న వారిని, పెట్టీ కేసుల్లో అరెస్టయి జైల్లో ఉన్నవారిని విడుదల చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: March 25, 2020, 8:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading