సోనియా వల్లే నెరవేరిన దశాబ్దాల తెలంగాణ కల: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Sonia gandhi birthday celebrations|దేశం కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషిచేస్తున్న గొప్ప నాయకురాలు సోనియాగాంధీ అని.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోనియా జన్మదినం సందర్భంగా గాంధీభవన్‌లో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

news18-telugu
Updated: December 9, 2018, 11:43 AM IST
సోనియా వల్లే నెరవేరిన దశాబ్దాల తెలంగాణ కల: ఉత్తమ్ కుమార్ రెడ్డి
సోనియాగాంధీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి file
  • Share this:
దశాబ్దాల తెలంగాణ ప్రజల కల యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ వల్లే సాకారమైందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 72వ పుట్టిన రోజు జరుపుకొంటున్న సోనియా గాంధీకి తెలంగాణ కాంగ్రెస్ తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో జరిగిన కేక్ కట్టింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశంకోసం, కాంగ్రెస్ పార్టీకోసం ఎనలేని క‌ృషిచేసిన సోనియాగాంధీ.. చరిత్రలో నిలిచిపోతారన్నారు.

అత్త, భర్తలను కోల్పోయిన క్లిష్టమైన పరిస్థితుల్లోనూ మనోనిబ్బరంతో దేశానికి సేవచేసేందుకు ముందుకువచ్చిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీ అని ఉత్తమ్ అన్నారు. అనేక సందర్భాల్లో ప్రధాని పదవిని అధిరోహించే అవకాశం వచ్చినా.. ఒప్పుకోలేదన్నారు. పది సంవత్సరాల పాటు యూపీఏ సర్కారును సమర్ధవంతంగా ముందుకు నడిపి.. చారిత్రాత్మకమైన చట్టాల రూపకల్పనలో కీలకపాత్ర పోషించారన్నారు. ఉపాధిహామీ పథకం ద్వారా ఉపాధిని కూడా ఒక హక్కుగా మార్చిన ఘతన సోనియాదేనన్నారు. పారదర్శకమైన పాలనకోసం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఆకలిచావులు అరికట్టేందుకు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వంటి నిర్ణయాలు తీసుకున్నారని ఉత్తమ్ చెప్పారు. చరిత్రలో నిలిచిపోయే చట్టాలు తీసుకొచ్చి.. పేదప్రజలకు సోనియాగాంధీ ఎనలేని మేలు చేకూర్చారని చెప్పారు.
Published by: Santhosh Kumar Pyata
First published: December 9, 2018, 11:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading