Home /News /politics /

TPCC REVANTH REDDY TO HIRE PRASHANT KISHOR EX AIDE SUNIL KANUGOLU FOR TELANGANA EARLY ELECTION AGAINST CM KCR MKS

CM KCRకు పీకే-Revanth Reddyకి ఎస్కే: ముందస్తు ఎన్నికల ప్లాన్ మామూలుగా లేదు..గురువుకు షాక్?

కేసీఆర్,పీకే, ఎస్కే, రేవంత్

కేసీఆర్,పీకే, ఎస్కే, రేవంత్

సీఎం కేసీఆర్.. టీఆర్‌ఎస్‌కు వ్యూహకర్తగా ప్రశాంత్‌కిషోర్ రంగంలోకి దింపారు. తానేమీ తక్కువ కాదంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం మాస్టర్ ప్లాన్ అమల్లో పెట్టారు. స్ట్రాటజిస్టు సునీల్ కనుగోలు(ఎస్కే)ను టీకాంగ్రెస్ హైర్ చేసుకుంది.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు (Early Elections in Telangana) ఖాయమనే సంకేతాలు స్పష్టంగా వెలువడుతుండటంతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. వ్యూహకర్తలను ఎంగేజ్ చేసుకునే పనిలో బిజీ అయ్యాయి. బీజేపీని బంగాళఖాతంలో కలిపేస్తానని శపథం సీఎం కేసీఆర్ (CM KCR).. టీఆర్‌ఎస్‌కు వ్యూహకర్తగా ప్రశాంత్‌కిషోర్ (Prashant Kishor)ను రంగంలోకి దింపారు. తానేమీ తక్కువ కాదంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) సైతం మాస్టర్ ప్లాన్ అమల్లో పెట్టారు. పీకే మాజీ శిష్యుడు, స్ట్రాటజిస్టుగా తనకంటూ ఇమేజ్ కలిగిన సునీల్ కనుగోలు(Sunil Kanugolu)(ఎస్కే)ను టీకాంగ్రెస్ హైర్ చేసుకుంది. రేవంత్ గతంలో టీఆర్ఎస్ లో పనిచేసి ఉండటం, ఎస్కే సైతం గతంలో పీకే సహచరుడు కావడంతో వీరి పోటీని గురుశిష్యుల సవాలుగానూ భావిస్తున్నారు కొందరు..

తెలంగాణలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నయం అంటోన్న కాంగ్రెస్.. కేసీఆర్ బాటలోనే ఎన్నికల వ్యూహకర్తను రంగంలోకి దించింది. ప్రశాంత్ కిషోర్ ప్రచార ధాటిని తట్టుకుని టీఆర్ఎస్ ను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ సమాయత్తం అవుతున్నది. ప్రశాంత్ కిషోర్ మాజీ అనుచరుడైన సునీల్ కనుగోలు (ఎస్కే) సేవలను ఉయోగించుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ డిసైడైంది. నిజానికి ఎస్కేను కర్ణాటక కాంగ్రెస్ ఇటీవలే హైర్ చేసుకుంది. పార్టీ ఒకటే కాబట్టి తెలంగాణలోనూ ఎస్కే సేవలకు ఆటంకాలు ఉండవనే నేతలు భావిస్తున్నారు. భావిస్తోంది.

CM KCR భయం భయం.. ఉక్రెయిన్ ప్రధాని కావొచ్చు.. Prashant Kishor సీన్ ఇదే: చుగ్


అదీగాక సునీల్‌ కనుగోలుకు తెలుగు రాష్ట్రాలతో అనుబంధం ఉంది. ఆయన విజయవాడలో జన్మించారు. ప్రస్తుతం సునీల్ కుటుంబం చెన్నైలో స్థిరపడింది. ఇప్పటికే సునీల్ అనేక పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరించారు. మొన్నటి పంజాబ్ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ కోసం ఎస్కే పనిచేశారు. ఆయనకు నేతలను విజయతీరాలకు చేర్చిన చరిత్ర కూడా ఉందని చెబుతున్నారు. అందువల్ల ఎస్కేను కాంగ్రెస్ వ్యూహకర్తగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

CM KCR ఫామ్‌హౌజ్‌లో Prashant Kishor -తెలంగాణలో ముందస్తు ఎన్నికలు! -TRS భారీ వ్యూహం


కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ ను, రేవంత్ రెడ్డి సునీల్ కనుగోలును వ్యూహకర్తలుగా నియమించుకోగా, ఆ రెండు పార్టీలకు భిన్నంగా వ్యూహకర్తల మీదగా ఆధారపడకుండా తన కార్యకర్తలనే బీజేపీ నమ్ముకుంది. ప్రశాంత్ కిషోర్‌లు బీజేపీకి అవసరం లేదని, బీజేపీ బూత్ స్థాయి కార్యకర్త ఒక్కో పీకేతో సమానమని తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్ చుగ్ కుండబద్దలు కొట్టారు. ఏడాది గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కేసీఆర్ ఎన్నికలకు వెళ్తాడని బీజేపీ అంచనా వేస్తోంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎదుర్కోడానికి కమలనాథులు సైతం రెడీ అవుతున్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Congress, Prashant kishor, Revanth Reddy, Telangana, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు