Huzurabad: ఆ ఒక్క ఓటుతో కాంగ్రెస్ గెలుపు - నా ముందు KTR పిల్ల బచ్చా : Revanth reddy

రేవంత్ రెడ్డి

దమ్ముంటే హుజూరాబాద్ ఉప ఎన్నికలో డిపాజిట్ తెచ్చుకోండంటూ మంత్రి కేటీఆర్ విసిరిన సవాలుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా కౌంటరిచ్చారు. సొంత చెల్లెలినే గెలిపించుకోలేని కేటీఆర్‌కు ఈ తరహా సవాళ్లు సెట్ కావని, జెడ్పీటీసీ నుంచి జాతీయ పార్టీ అధ్యక్షుడి దాకా ఎదిన తన ముందు కేటీఆర్ పిల్ల బచ్చాఅని రేవంత్ ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ గెలుపు స్ట్రాటజీని కూడా వివరించారాయన..

  • Share this:
రెండు ఆంబోతులు కొట్టుకుని లేగ దూడ కాలు తొక్కినట్లుగా.. హుజూరాబాద్ లో బీజేపీ-టీఆర్ఎస్ పోటాపోటీగా కోటానుకోట్లు ఖర్చుపెడుతూ, కాంగ్రెస్ అభ్యర్థికి సవాళ్లు విసరడమేంటని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వాపోయారు. దమ్ముంటే ఉపఎన్నికలో డిపాజిట్ తెచ్చుకోండంటూ కేటీఆర్ చేసిన కామెంట్లపై కాంగ్రెస్ చీఫ్ మండిపడ్డారు. రాజకీయ అనుభవంతోపాటు మిగతా అన్ని విషయాల్లో తన ముందు కేటీఆర్ బచ్చాగాడని, కేతండ్రి పెట్టిన ప్రాంతీయ పార్టీకి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిండెంట్ అయితే, జెడ్పీటీసీ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయ పార్టీకి అధ్యక్షుడైన అనుభవం నాదని రేవంత్ గుర్తుచేశారు. రాజకీయాలు, పదవుల విషయంలో కేటీఆర్.. రేవంత్ కు సమానం కాదని, ఈ విషయంలో ఎలాంటి చర్చకైనా తాను సిద్దమని, కేటీఆర్ కు దమ్ముంటే చర్చకు రావాలని రేవంత్ ప్రతిసవాలు విసిరారు.

హరీశ్ రావుపై ఈసీకి ఫిర్యాదు
ఇటు టీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావు, అటు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్ని రకాల నిబంధనల ను తుంగలో తొక్కారని, హుజూరాబాద్ ఉప ఎన్నికను దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా మార్చేశారని కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. పంపకాలలో తేడాల వల్లే హరీశ్-ఈటల మాటల యుద్ధం చేసుకుంటున్నారని, ఆ రెండు పార్టీలూ కోట్ల రూపాయాలు వెదజల్లుతున్నాయని, హుజూరాబాద్ లో హరీశ్ రావు చేస్తోన్న పంపకాల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని రేవంత్ తెలిపారు.

ఉపరాష్ట్రపతిగా KCR అసలు కథ ఇదే -ఓడిపోతే దుప్పటి కప్పుకోవాలా? Huzurabad చాలా చిన్న ఎన్నిక: మంత్రి KTR సంచలన వ్యాఖ్యలు


ఆ ఒక్క ఓటుతో కాంగ్రెస్ గెలుపు
హుజూరాబాద్ పరిధిలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్న సభలో నోటిఫికేషన్లు ఏవని అడిగిన నిరోషా అనే నిరుద్యోగ యువతిపై టీఆర్ఎస్ శ్రేణులు, పోలీసులు దాష్టీకానికి పాల్పడిన ఘటనపైనా ఈసీకి ఫిర్యాదు చేయబోతున్నట్లు రేవంత్ చెప్పారు. ప్రశ్నించేవారిపై పాలకులు చేస్తోన్న దాడిని కాంగ్రెస్ ఖండిస్తోందని, అలా ప్రశ్నించినందుకే బాల్మూరు వెంకట్ పైనా గులాబీ సర్కారు దాడికి పాల్పడిందని, ఆ కారణం చేతనే వెంకట్ ను హుజూరాబాద్ లో నిలబెట్టామన్నారు. ‘ఇంటికి ఒక్క ఓటు కాంగ్రెస్ కు’ అనే స్ట్రాటజీతో హుజూరాబాద్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నామని టీపీసీసీ చీఫ్ చెప్పారు. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ, నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ గెలిచిన తర్వాత కూడా అక్కడి పరిస్థితులు మారలేదని, కాబట్టే హుజూరాబాద్ లో కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రజల్ని వేడుకుంటున్నామని, ఇంటికొ ఒక్క ఓటు నినాదంతో ముందుకుపోతున్నామని రేవంత్ తెలిపారు.

Jr NTR మనసు మార్చే ప్రయత్నం? -చర్చలకు వెళ్లింది ఎవరో తెలుసా? -చంద్రబాబు మంతనాలపై లోకేశ్ అలక!


రైతుబంధుకు లేని అడ్డు దళిత బందుకా?
టీఆర్ఎస్, బీజేపీ తోడుదొంగలని, కూడబలుక్కొనే దళిత బంధు పథకాన్ని నిలిపేశాయని, రైతు బంధుకు లేని ఇబ్బంది దళిత బంధుకు ఎందుకో ఆ రెండు పార్టీలే చెప్పాలని, దళిత బంధు నిలిపివేతపై టీఆర్ఎ, బీజేపీలు ఈసీని ఎందుకు అడగటంలేదని రేవంత్ ప్రశ్నించారు. బీసీల మీదకు దళితుల్ని రెచ్చగొట్టేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నాడని, దళితుల పేరుతో ఇప్పటికే ఎన్నో మోసాలకు పాల్పడ్డ కేసీఆర్ బంధు పథకంలోనూ తన మార్కు చూపిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ వేసిన నామినేషన్లపై ఒక్క దళిత బిడ్డ సంతకం కూడా లేదని కాంగ్రెస్ నేత గుర్తుచేశారు.
Published by:Madhu Kota
First published: