హోమ్ /వార్తలు /National రాజకీయం /

Revanth Reddy: హుజురాబాద్‌లో రేవంత్ రెడ్డి ఎదుర్కోబోయే అసలు సిసలు పరీక్ష ఇదే..!

Revanth Reddy: హుజురాబాద్‌లో రేవంత్ రెడ్డి ఎదుర్కోబోయే అసలు సిసలు పరీక్ష ఇదే..!

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Revanth Reddy: హుజూరాబాద్‌ ఉప ఎన్నికను రేవంత్ రెడ్డి ఈ స్థాయిలో సీరియస్‌గా తీసుకుంటారా ? అన్న అంశంపై కూడా కాంగ్రెస్ వర్గాల్లో క్లారిటీ లేదు.

  తెలంగాణలో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటనే దానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కాకముందు ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు రావడంతో.. హుజూరాబాద్‌లోనూ ఆ ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు, రాజకీయ విశ్లేషకులు భావించారు. అందుకు తగ్గట్టుగానే కొండా సురేఖ వంటి బలమైన నేతలను హుజూరాబాద్ రేసులో నిలపాలని చూశారు రేవంత్ రెడ్డి. కానీ కొన్ని ఇతరత్రా కారణాల వల్ల రేవంత్ రెడ్డి ప్లాన్ వర్కవుట్ కాలేదు. దీంతో పార్టీలో పెద్దగా ఎవరికీ తెలియని విద్యార్థి విభాగం నాయకుడు బల్మూరి వెంకట్‌ను హుజూరాబాద్ బరిలో నిలిపింది కాంగ్రెస్.

  బల్మూరి వెంకట్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారు కావడంతో.. ఇక హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించేందుకు పూర్తిగా రేవంత్ రెడ్డి శ్రమించాల్సిందే అని రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. కౌశిక్ రెడ్డి, కొండా సురేఖ వంటి వాళ్లు కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి ఉంటే.. సొంతంగా వాళ్లు కొంత మేర ఓట్లు సాధించి ఉండేవాళ్లని.. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

  ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్, బీజేపీలను ఎదురొడ్డి హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు సాధించడం అంత సులుభం కాదనే వాదన కూడా ఉంది. ఒకవేళ అక్కడ కాంగ్రెస్ గౌరవప్రదమైన స్థాయిలో ఓట్లు దక్కించుకోవాలంటే.. స్వయంగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి హుజూరాబాద్‌లో విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉంటుందని.. అక్కడే మకాం వేసి ఓటర్లను పార్టీ వైపు ఆకర్షించేందుకు వ్యూహాలు రచించాల్సి ఉంటుందని స్వయంగా కాంగ్రెస్ శ్రేణులే చర్చించుకుంటున్నాయి. అంతేకాదు రేవంత్ రెడ్డి హుజూరాబాద్ ప్రచారంలోకి దిగితే.. అక్కడ కాంగ్రెస్‌కు వచ్చే ఓట్లలో మెజార్టీ శాతం రేవంత్ రెడ్డికి వచ్చినట్టే అనే చర్చ కూడా సాగుతోంది.

  Chiranjeevi: క్లైమాక్స్‌కు చేరుకుంటున్న మా ఎన్నికలు.. లాస్ట్ పంచ్ మెగాస్టార్‌దేనా.. ఆయన మాటలకు అర్థమేంటి ?

  Fake Banking Apps: బ్యాంకింగ్ యాప్స్‌తో జరభద్రం.. ఫేక్ యాప్స్‌ను ఇలా గుర్తించండి..

  అయితే హుజూరాబాద్‌ ఉప ఎన్నికను రేవంత్ రెడ్డి ఈ స్థాయిలో సీరియస్‌గా తీసుకుంటారా ? అన్న అంశంపై కూడా కాంగ్రెస్ వర్గాల్లో క్లారిటీ లేదు. రేవంత్ రెడ్డి ఈ ఉప ఎన్నిక అంశాన్ని అంత సీరియస్‌గా తీసుకోవడం లేదని.. ఆయన దృష్టి అంతా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకోవడం ఎలా అనే అంశంపై ఉందని పలువురు చెబుతున్నారు. మొత్తానికి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది రేవంత్ రెడ్డి ప్రచారం పర్వంలోకి దిగితే కానీ చెప్పలేమని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Huzurabad By-election 2021, Revanth Reddy, Telangana

  ఉత్తమ కథలు