Home /News /politics /

TPCC PRESIDENT REVANTH REDDY STILL NOT YET DECIDED ON CONTESTING IN KODANGAL AGAIN OR OTHER CONSTITUENCIES IN TELANGANA AK

ఆ విషయంలో Revanth Reddy ఎటూ తేల్చుకోలేకపోతున్నారా ?.. ఇంకా టైమ్ ఉందని ఎదురుచూస్తున్నారా ?

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Revanth Reddy: ప్రస్తుతం మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారు. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు.

    తెలంగాణలో టీఆర్ఎస్‌ను ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఆ పోస్టు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ అధిగమించి ముందుకు సాగడం ఎలా అనే దానిపై తర్జనభర్జన పడుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు బీజేపీ ఇదే రకమైన దూకుడు కొనసాగించి.. కాంగ్రెస్ పరిస్థితి ఇదే రకంగా ఉంటే ఏం జరుగుతుందో అనే చర్చ తెలంగాణ (Telangana) రాజకీయవర్గాల్లో మొదలైంది. టీఆర్ఎస్‌తో రాజకీయం పోరాటం చేసేందుకు సిద్ధమైన కాంగ్రెస్.. ముందుగా బీజేపీని అధిగమించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీని ఆ దిశగా ముందుకు నడిపించడం తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి(Revanth Reddy)  పెద్ద సవాల్‌గా మారింది. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలను తగ్గించి.. కాంగ్రెస్‌లో కదనోత్సాహం తీసుకురావడం రేవంత్ రెడ్డికి అంత ఈజీకాదనే విషయం జరుగుతున్న పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

    ఇదిలా ఉంటే ప్రస్తుతం మల్కాజ్ గిరి (Malkajgiri) నుంచి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారు. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు. అయితే ఆయన ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. రేవంత్ రెడ్డి పోటీ చేయడానికి ఆయన సొంత సీటు కొడంగల్ (Kodangal) రెడీగా ఉంది. అక్కడి నుంచి పోటీ చేయడానికి ఆయనకు ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఈసారి కొడంగల్ నుంచి కాకుండా గ్రేటర్ పరిధిలోని ఉప్పల్ (Uppal) లేదా ఎల్‌బీనగర్ (LB Nagar)  నుంచి పోటీ చేసే అవకాశం ఉందని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    గతంలోనూ రేవంత్ రెడ్డి విషయంలో ఇలాంటి వార్తలు వచ్చినా... ఆయన మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీలుగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మళ్లీ నల్లగొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కొంతకాలంగా ఆయన నల్లగొండ ఎమ్మెల్యే సెగ్మెంట్ స్థానం పరిధిలోనే ఎక్కువగా పర్యటనలు చేస్తున్నారనే వార్తలు కాంగ్రెస్‌లో వినిపిస్తున్నాయి. దీంతో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారని కాంగ్రెస్‌లోని కొందరు చర్చించుకుంటున్నారు.

    ఇక ఉత్తమ్ కుమార్ కోదాడ లేదా హుజూర్ నగర్ నుంచి బరిలోకి దిగేందుకు ఎలాంటి ఆటంకాలు లేవు. ఉత్తమ్, ఆయన భార్యకు ఈ రెండు సీట్లు కాంగ్రెస్ తరపున ఎలాగూ రిజర్వ్ అయిపోయాయి. టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి ఉప్పల్, ఎల్‌బి నగర్ లేదా కొడంగల్ నుంచి పోటీ చేసేందుకు ఆయనకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ.. ఈ మూడు స్థానాల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తోంది.

    KCR-BJP: కేసీఆర్‌తో ఆ నేతల భేటీని బీజేపీ సీరియస్‌గా తీసుకోవడం లేదా ?

    KCR-Congress: కేసీఆర్ కొత్త ప్రయత్నాలు.. కాంగ్రెస్‌లో మొదలైన టెన్షన్.. అదే జరిగితే..?

    మరోవైపు వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కొడంగల్‌తో ఉప్పల్ లేదా ఎల్‌బీనగర్ రెండు స్థానాల్లో పోటీ చేసే అవకాశం లేకపోలేదనే చర్చ కూడా సాగుతోంది. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో.. ఆయన ఈ అంశంపై అంతగా ఆలోచించడం లేదని.. ముందుగా రాష్ట్రంలో పార్టీని ఏ రకంగా బలోపేతం చేయాలనే అంశంపై ఆయన ఫోకస్ చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Mp revanthreddy, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు