Home /News /politics /

Revanth Reddy: అలా జరగకుండా చూడండి.. కాంగ్రెస్ పెద్దలకు రేవంత్ రెడ్డి రిక్వెస్ట్..

Revanth Reddy: అలా జరగకుండా చూడండి.. కాంగ్రెస్ పెద్దలకు రేవంత్ రెడ్డి రిక్వెస్ట్..

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Revanth Reddy: ఒకవేళ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన నిరసనలు, సమావేశాల్లో టీఆర్ఎస్ పాల్గొంటే.. అది రాష్ట్రస్థాయిలో తమకు నష్టం కలిగిస్తుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం.

    తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హుజూరాబాద్ ఉప ఎన్నికల తరువాత బీజేపీ బలం పుంజుకోవడం.. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల తరువాత మరింత బలహీనపడుతున్నట్టుగా రాజకీయ వాతావరణం మారిపోయింది. రాష్ట్రంలో ఇప్పుడు అధికార టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ కంటే ఎక్కువగా బీజేపీనే తమ ప్రత్యర్థి అన్నట్టుగా వ్యవహరిస్తోంది. బీజేపీ టార్గెట్‌గా టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలు కొనసాగుతున్నాయి. అయితే ఇటు రాష్ట్రంలో టీఆర్ఎస్‌ టార్గెట్‌గా రాజకీయాలు చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్.. బీజేపీపై కూడా విమర్శలు గుప్పిస్తూ రాష్ట్రంలో మళ్లీ పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారాయనే చర్చ జరుగుతోంది.

    ఢిల్లీలోని పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళనకు టీఆర్ఎస్ కూడా జత కలిసింది. అందులో కాంగ్రెస్, టీఆర్ఎస్‌ ఉన్నాయి. ఈ రెండు పార్టీల నేతలు కలిసి సమావేశంలో పాల్గొనడాన్ని తెలంగాణలోని బీజేపీ హైలెట్ చేసింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒక్కటే అని.. తెలంగాణలో ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకోవడం మొదలుపెట్టింది. అయితే కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆందోళనలో పాల్గొనాలని.. వారితో కలిసి సమావేశంలో పాల్గొనాలనే ఆలోచన టీఆర్ఎస్‌కు లేకపోయినా.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ సహా పలు విపక్షాలతో టీఆర్ఎస్ సమావేశమైంది.

    అయితే ఇది తెలంగాణలోని కాంగ్రెస్ నేతలకు ఇబ్బందిగా మారిందనే చర్చ జరుగుతోంది. ఒకవేళ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన నిరసనలు, సమావేశాల్లో టీఆర్ఎస్ పాల్గొంటే.. అది రాష్ట్రస్థాయిలో తమకు నష్టం కలిగిస్తుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని ఢిల్లీ స్థాయిలోని కొందరు కాంగ్రెస్ పెద్దలకు రేవంత్ రెడ్డి అండ్ టీమ్ చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జాతీయ స్థాయిలో టీఆర్ఎస్‌కు దూరంగా ఉంటేనే రాష్ట్రంలో తాము ఆ పార్టీపై చేస్తున్న రాజకీయ పోరాటాల ద్వారా పొలిటికల్ మైలేజీ ఉంటుందని.. అలా జరగని పక్షంలో మొదటికే మోసం వస్తుందని నేతలు వారికి చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

    Telangana: వరికి బదులు ఈ పంటల వేయండి.. రైతులకు సీఎం కేసీఆర్ సూచన

    Etela Rajendar: ఈటల రాజేందర్ మాస్టర్ ప్లాన్.. అదే జరిగితే బీజేపీలో లెక్కలు మారతాయా ?

    Weight Loss: బరువు తగ్గాలని ట్రై చేస్తున్నారా.. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా చేయండి

    మీరు నాన్ వెజ్ తినరా ?.. అయితే ప్రొటీన్లు పుష్కలంగా లభించే ఈ ఆహారాలను తీసుకోండి..

    అయితే జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్లాల్సిన బాధ్యత తమపై ఉంటుందని.. ఈ విషయంలో కలిసొచ్చే వారిని రాకుండా అడ్డుకోలేమని కాంగ్రెస్ పెద్దలు కొందరు రాష్ట్రస్థాయి నేతలకు చెప్పినట్టు సమాచారం. మొత్తానికి తెలంగాణలో టీఆర్ఎస్‌పై రాజకీయ పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు ఇబ్బందిగా మారినట్టు కనిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Revanth reddy, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు