హోమ్ /వార్తలు /National రాజకీయం /

Revanth Reddy: అసెంబ్లీ రౌడీ సినిమా సీన్ గురించి చెప్పిన రేవంత్ రెడ్డి.. ఎందుకంటే..

Revanth Reddy: అసెంబ్లీ రౌడీ సినిమా సీన్ గురించి చెప్పిన రేవంత్ రెడ్డి.. ఎందుకంటే..

రేవంత్ రెడ్డి (పైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి (పైల్ ఫోటో)

Revanth Reddy: ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీలు కూడా అదే రకమైన దుమ్మి సీన్ క్రియేట్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. వాళ్లిద్దరూ కలిసి వాళ్లలో వాళ్లే కొట్టుకుంటున్నట్టు నటిస్తూ... రైతులను దగా చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

ఇంకా చదవండి ...

  రాజకీయాల్లో ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు చేసే నాయకుల్లో రేవంత్ రెడ్డి (revanth reddy) కూడా ఒకరు. ప్రజలకు అర్థమయ్యేలా పరిస్థితులను వివరించే రేవంత్ రెడ్డి.. అధికార టీఆర్ఎస్ ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కేంద్రానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనపై తనదైన శైలిలో స్పందించారు. టీఆర్ఎస్ (TRS), బీజేపీ (BJP) ఈ విషయంలో రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించిన రేవంత్ రెడ్డి.. మోదీ, కేసీఆర్ ఒక్కటేనని ఆరోపించారు. ఇద్దరూ కలిసి రైతులను నట్టేట ముంచేందుకు ప్లాన్ చేశారని విమర్శించారు. ఈ క్రమంలోనే బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనని చెప్పేందుకు హీరో మోహన్ బాబు సూపర్ హిట్ మూవీ అసెంబ్లీ రౌడీ సీన్ గురించి చెప్పారు రేవంత్ రెడ్డి. ఆ సినిమాలో విలన్ బాషా మనుషులు రోడ్డు మీదకు వచ్చి తమలో తామే కొట్టుకుంటారని.. తమకు టార్గెట్‌గా ఉన్న వారిని చంపేందుకు వాళ్లు అలా చేస్తారని రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు.

  ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీలు కూడా అదే రకమైన దుమ్మి సీన్ క్రియేట్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. వాళ్లిద్దరూ కలిసి వాళ్లలో వాళ్లే కొట్టుకుంటున్నట్టు నటిస్తూ... రైతులను దగా చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ వరి ధాన్యం కొనుగోలు అంశాన్ని లేవనెత్తడం.. ఆ వెంటనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గరకు వెళ్లడం.. ఆ వెంటనే అక్కడ గొడవలు జరగడం.. ఇవన్నీ అసెంబ్లీ రౌడీ సీన్‌ తరహా ప్లాన్‌లో భాగమే అని రేవంత్ రెడ్డి వివరించారు.

  బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో స్పష్టమైన ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. ఇక వరి కొనుగోలు వ్యవహారంపై తెలంగాణ సీఎం కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తాజాగా ఆయన కొత్త నాటకం మొదలుపెట్టారని.. ఈ నాటకాలు కట్టిపెట్టి ముందు రైతులు పండించి మార్కెట్‌కు తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

  Revanth Reddy: హైకమాండ్ ముఖ్యనేత ప్రశ్న.. రేవంత్ రెడ్డి నిర్ణయాలు మారనున్నాయా ?

  K Chandrashekar Rao: వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి.. కేసీఆర్ లెక్కేంటి ?

  ఇక వరి కొనుగోలు అంశంపై టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంటే.. రాష్ట్రంలో ఉన్న ధాన్యం కొనుగోలును వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ గార్డెన్ నుండి ర్యాలీ చేపట్టింది. ర్యాలీలో భాగంగా రేవంత్ రెడ్డితోపాటు పార్టీ నేతలు రోడ్డుపై బైఠాయించారు. వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. అయితే పోలీసులు కంచె వేసి అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.. ఈ ర్యాలీలో పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోపాటు మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎమ్మెల్యే సీతక్క‌తోపాటు పలువురు నేతలు పాల్గోన్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Revanth Reddy, Telangana

  ఉత్తమ కథలు