హోమ్ /వార్తలు /politics /

Revanth Reddy: ఆ సీనియర్ నేతతో టీఆర్ఎస్, బీజేపీలకు చెక్.. రేవంత్ రెడ్డి ప్లాన్ ?

Revanth Reddy: ఆ సీనియర్ నేతతో టీఆర్ఎస్, బీజేపీలకు చెక్.. రేవంత్ రెడ్డి ప్లాన్ ?

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Revanth Reddy: టీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్న డీఎస్‌ను కాంగ్రెస్‌లోని తీసుకొస్తే.. సంజయ్‌ను కూడా పార్టీలోకి తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చని రేవంత్ రెడ్డి అండ్ టీమ్ భావిస్తోందని సమాచారం.

  రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత కొంతమంది నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. వారిలో గండ్ర సత్యనారాయణ వంటి నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే మరికొందరు నేతలకు పార్టీలో చేరేందుకు గ్రీన్‌సిగ్నల్ రాలేదనే చర్చ జరుగుతోంది. అలాంటి నేతల జాబితాలో మాజీ కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ (D. Srinivas) కుమారుడు సంజయ్ కూడా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి (Revanth Reddy) టీపీసీసీ చీఫ్ అయిన తరువాత ధర్మపురి సంజయ్ రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్‌లో చేరాలనే తన అభిప్రాయాన్ని చెప్పారు. ఇందుకు రేవంత్ రెడ్డి కూడా ఓకే చెప్పారు. కానీ ఆయన చేరిక విషయంలో జిల్లా కాంగ్రెస్ (Congress)నేతలు అంత సుముఖంగా లేరని టాక్.

  రాజకీయంగా అంత మంచి ట్రాక్ రికార్డ్ లేని సంజయ్‌ను పార్టీలో చేర్చుకోవడం సరికాదని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. దీంతో సంజయ్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అంశాన్ని వాయిదా వేయాలని హైకమాండ్ రేవంత్ రెడ్డికి చెప్పినట్టు తెలుస్తోంది. అయితే సంజయ్‌ను పార్టీలోకి తీసుకురావాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి.. ఈ విషయంలో అధిష్టానం అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని సంజయ్‌తో పాటు ఆయన తండ్రి డీఎస్‌ను కూడా పార్టీలోకి తీసుకురావాలని భావించారట.

  ఈ క్రమంలోనే డీఎస్‌తో కొద్దిరోజుల క్రితం సమావేశమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్న డీఎస్‌ను కాంగ్రెస్‌లోని తీసుకొస్తే.. సంజయ్‌ను కూడా పార్టీలోకి తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చని రేవంత్ రెడ్డి అండ్ టీమ్ భావిస్తోందని సమాచారం.

  Maa Elections 2021: మా ఎన్నికల ఎఫెక్ట్.. ఆ నినాదం ప్రభావం తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఉంటుందా ?

  YS Jagan: జగన్‌ను టెన్షన్ పెడుతున్న వైఎస్ఆర్ సన్నిహితుడు.. వైసీపీలో టెన్షన్

  అందుకే సంజయ్ చేరికపై కాకుండా డి.శ్రీనివాస్‌ను పార్టీలోకి తీసుకొచ్చే అంశంపై రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారని టాక్. డీఎస్‌ను పార్టీలోకి తీసుకురావడం ద్వారా టీఆర్ఎస్‌తో పాటు ఎంపీగా ఉన్న ఆయన రెండో కుమారుడు అరవింద్‌కు కూడా చెక్ చెప్పినట్టు అవుతుందనే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు సమాచారం. మొత్తానికి కాంగ్రెస్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నించిన సీనియర్ నేత డీఎస్ కుమారుడి ఆశలు అంత ఈజీగా నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Nizamabad, Revanth Reddy, Telangana

  ఉత్తమ కథలు