టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి రాకముందు టీడీపీలో ఉన్నారు. ఆరంభంలో బీజేపీ, టీఆర్ఎస్’లో పని చేసిన రేవంత్ రెడ్డి.. ఆ తరువాత ఎమ్మెల్సీగా విజయం సాధించి టీడీపీలో చేరారు. ఆ తరువాత టీడీపీలోనే రాజకీయంగా ఎదిగారు. రాష్ట్రస్థాయి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతుతో రాజకీయంగా దూసుకుపోయారు. ఆ తరువాత ఓటుకు నోటు కేసు తెరపైకి రావడం.. తెలంగాణలో టీడీపీ పూర్తిగా ప్రభావం కోల్పోవడంతో రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లో చేరిన కొన్నేళ్లకే టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకుని అధికార టీఆర్ఎస్పై తనదైన శైలిలో రాజకీయ పోరాటాన్ని ఉధృతం చేశారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్పై పోరాటానికి కలిసి వచ్చే అన్ని పార్టీలతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్న రేవంత్ రెడ్డి.. తెలంగాణ టీడీపీని కలుపుకుని ముందుకు వెళ్లే విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది.
ఇటీవల వామపక్షాలతో పాటు ఇతర పార్టీలతో కలిసి గాంధీభవన్’లో సమావేశం ఏర్పాటు చేశారు రేవంత్ రెడ్డి. వారితో కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేయాలని నిర్ణయించారు. అయితే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ టీడీపీ మాత్రం కనిపించలేదు. ఈ సమావేశానికి తెలంగాణ టీడీపీ నేతలను ఆహ్వానించలేదా ? లేక ఆహ్వానం అందినా టీడీపీ ఈ సమావేశానికి రాలేదా ? అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే బీజేపీ, టీఆర్ఎస్ మినహా తమతో కలిసి వచ్చే మిగతా పార్టీలను కలుపుకుని ముందుకు సాగిపోవాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి.. తెలంగాణ టీడీపీ విషయంలో మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డిని ఇప్పటికీ చంద్రబాబు కోవర్టు అని అధికార టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.
Benefits Of Ghee: నెయ్యి వల్ల ఎన్నో ప్రయోజనాలు.. ఈ రకమైన అనారోగ్యాలకు చెక్ పెట్టండి
TSRTC: తెలంగాణ ఆర్టీసీకి సీఎం కేసీఆర్ బిగ్ షాక్... నాలుగు నెలలే గడువు
కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు సైతం ఇదే రకమైన విమర్శలు చేశారు. దీంతో తెలంగాణ టీడీపీతో కలిసి పని చేసే విషయంలో రేవంత్ రెడ్డి డైలమాలో పడిపోయారని.. అందుకే ఆ పార్టీని దూరంగా పెట్టారని చర్చ జరుగుతోంది. తెలంగాణ టీడీపీతో కలిసి ముందుకు సాగితే.. రాజకీయంగా లాభం కంటే నష్టమే ఎక్కువనే అభిప్రాయానికి వచ్చిన తరువాతే రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారేమో అనే టాక్ కూడా వినిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Revanth Reddy, Telangana