HOME »NEWS »POLITICS »tpcc new president selection process ends manikam tagore moving to delhi tension among telangana congress leaders ak

Telangana: క్లైమాక్స్‌కు ‘టీపీసీసీ’ ఎపిసోడ్.. ఢిల్లీకి ఠాగూర్‌.. సీనియర్ నేతల హెచ్చరిక

Telangana: క్లైమాక్స్‌కు ‘టీపీసీసీ’ ఎపిసోడ్.. ఢిల్లీకి ఠాగూర్‌.. సీనియర్ నేతల హెచ్చరిక
ఉత్తమ్, జగ్గారెడ్డి‌తో మాణికం ఠాగూర్ (ఫైల్ ఫోటో)

Telangana Congress: తెలంగాణలో పార్టీకి నష్టం చేకూర్చే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని సీనియర్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని ఢిల్లీ పెద్దలకు చెప్పేందుకు అవసరమైతే హస్తినకు వెళ్లాలని కొందరు నేతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

  • Share this:
    తెలంగాణలో బలహీనపడ్డ కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకుంటుందో లేదో తెలియదు కానీ.. ఆ పార్టీలో ఖాళీ అయిన పీసీసీ చీఫ్ పదవి మాత్రం కష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌ను మరింత ఇబ్బందుల్లో నెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఉత్తమ్ రాజీనామాతో ఖాళీ అయిన టీపీసీసీ చీఫ్ పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో ఉండి పలువురు నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, పీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్న ఆశావాహులు ఆయనతో సమావేశమయ్యారు.

    ఈ పదవి కోసం ప్రధాన పోటీ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్యే ఉందనే టాక్ వినిపిస్తున్న.. అధిష్టానం కొత్త పేరును ఎంపిక చేసినా ఆశ్చర్యం లేదని మరికొందరు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలువురు నేతలతో సమావేశమైన మాణికం ఠాగూర్‌కు కొందరు నేతలు ఈ విషయంలో వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, పొడెం వీరయ్య, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి పలువురు నేతలు ఠాగూర్‌ను కలిసి ఒకరకమైన హెచ్చరిక చేశారని సమాచారం. సీనియర్ల అభిప్రాయానికి ప్రాధన్యత ఇవ్వాలని.. కాదని మీ ఇష్టానుసారంగా పీసీసీ ఇస్తే పార్టీలో మేం ఉండలేమని సీనియర్లు కొందరు తెగేసి చెప్పినట్టు సమాచారం. సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా.. ఏదో నిర్ణయం తీసుకుంటే.. తాము రాజీనామా చేస్తామని హెచ్చరించినట్టు వారత్లు వినిపిస్తున్నాయి.



    అంతేకాదు తెలంగాణలో పార్టీకి నష్టం చేకూర్చే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని సీనియర్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని ఢిల్లీ పెద్దలకు చెప్పేందుకు అవసరమైతే హస్తినకు వెళ్లాలని కొందరు నేతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరోవైపు కొత్త పీసీసీ చీఫ్‌ ఎంపికపై ఠాగూర్ అభిప్రాయ సేకరణ ముగిసింది. నేడు సాయంత్రం ఢిల్లీకి వెళుతున్న ఠాగూర్.. అధిష్టానంతో చర్చించి కొత్త పీసీసీ చీఫ్‌ను ఎంపిక చేస్తారని టాక్ వినిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:December 12, 2020, 15:38 IST