ఆ నేతలపై తెలంగాణ కాంగ్రెస్ సీరియస్...

పార్టీ చేపట్టే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న నేతలపై తెలంగాణ కాంగ్రెస్ చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది.

news18-telugu
Updated: May 5, 2020, 9:07 PM IST
ఆ నేతలపై తెలంగాణ కాంగ్రెస్ సీరియస్...
తెలంగాణ కాంగ్రెస్
  • Share this:
పార్టీ కారణంగా ఎన్నో కీలక పదవులు పొంది... కీలక సమయంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వారిపై తెలంగాణ కాంగ్రెస్ సీరియస్‌గా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా పార్టీ చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో పాల్గొనని నేతలపై టీపీసీసీ దృష్టి సారించింది. పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొనని నేతలకు జాబితాను ఏఐసీసీకి పంపించాలనే యోచనలో ఉన్న టీపీసీసీ... వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలుస్తోంది. ఏఐసీసీ ఆదేశాలకు మేరకు చర్యలకు రంగం సిద్ధం చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా పీసీసీ బాధ్యతల్లో ఉండి దీక్షలో పాల్గొనని వారి వివరాలను పార్టీ రాష్ట్ర నాయకత్వం సేకరిస్తోంది. జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా సమాచారం సేకరించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. వివరాలు వచ్చిన వెంటనే సదరు నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
Published by: Kishore Akkaladevi
First published: May 5, 2020, 9:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading