కేసీఆర్‌కు ఉత్తమ్ సూటి ప్రశ్న.. వాటి సంగతేంటి..?

కేంద్రంలో మోదీ మతపరమైన రాజకీయాలు చేస్తుంటే.. రాష్ట్రంలో కేసీఆర్ కాంగ్రెస్ కార్యకర్తలను అణచివేస్తున్నారని విమర్శించారు.

news18-telugu
Updated: January 1, 2020, 6:13 PM IST
కేసీఆర్‌కు ఉత్తమ్ సూటి ప్రశ్న.. వాటి సంగతేంటి..?
ఉత్తమ్ కుమార్, కేసీఆర్ (File)
  • Share this:
టీఆర్ఎస్ కుటుంబ పాలన,దోపిడీ పాలనతో తెలంగాణలో రాజకీయాలు భ్రష్టు పట్టాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.కేంద్రంలో మోదీ మతపరమైన రాజకీయాలు చేస్తుంటే.. రాష్ట్రంలో కేసీఆర్ కాంగ్రెస్ కార్యకర్తలను అణచివేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ త్వరలోనే జైల్ భరో నిర్వహిస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు.

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నిస్తున్నానని, నిరుద్యోగ భృతి ఎక్కడ? అని ప్రశ్నించారు. రుణమాఫీ

ఎక్కడ,రైతు బంధు ఎక్కడ? నిలదీశారు. తాను మున్సిపల్ ఎన్నికల గురించి మాట్లాడితే టీఆర్ఎస్ నాయకులు ఏవేవో పిచ్చి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రకటనకు,నామినేషన్లకు మధ్య ఒక్కరోజే గడువు ఉందని, దాన్ని వారం రోజులకు పెంచాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. గతంలో కాంగ్రెస్‌లో పనిచేసి వేరే పార్టీలోకి వెళ్లినవారు తిరిగి సొంతగూటికి రావాలని ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల్లో తామే విజయం సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
Published by: Srinivas Mittapalli
First published: January 1, 2020, 6:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading