నీ అంతు చూస్తాం.. నీకు క్యారెక్టర్ లేదు.. : సీపీపై నిప్పులు చెరిగిన ఉత్తమ్

హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏజెంట్‌గా పనిచేస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

news18-telugu
Updated: December 28, 2019, 5:38 PM IST
నీ అంతు చూస్తాం.. నీకు క్యారెక్టర్ లేదు.. : సీపీపై నిప్పులు చెరిగిన ఉత్తమ్
ఉత్తమ్ కుమార్ (ఫైల్ ఫోటో)
  • Share this:
హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏజెంట్‌గా పనిచేస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పోలీసుగా విధులు నిర్వర్తించాల్సిన సీపీ ప్రభుత్వ ఏజెంటుగా పనిచేయడమేంటని మండిపడ్డారు. అసలు అంజనీకుమార్‌కి కేరక్టర్ లేదని, ఆయన అవినీతిలో కూరుకుపోయాడని ఆరోపించారు. సీపీగా కొనసాగే అర్హత అంజనీ కుమార్‌కు లేదన్నారు. కాంగ్రెస్ 135వ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో తిరంగా ర్యాలీకి సీపీ అనుమతి నిరాకరించడంతో ఉత్తమ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు హైదరాబాద్ గాంధీభవన్‌లో నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో ఆయన మాట్లాడారు.

సీపీ అంజనీ కుమార్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. సీపీ అంజనీకుమార్ తన పేరుకు ముందు ఐపీఎస్ తీసేసి కేపీఎస్ అని పెట్టుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. కేపీఎస్ అంటే కల్వకుంట్ల పోలీస్ సర్వీస్ అని చెప్పారు. గాంధీభవన్‌లో దీక్ష చేస్తుంటే కార్యకర్తలను అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. కార్యకర్తలు రాకుండా అడ్డుకోవడానికి మీరెవరు అని ప్రశ్నించారు.ఆర్ఎస్ఎస్,ఎంఐఎం సభలకు అనుమతినిచ్చే టీఆర్ఎస్.. తమకు మాత్రం ఎందుకు అనుమతి ఇవ్వదన్నారు. సీపీ ఓవర్ యాక్షన్ చేస్తే అంతు చూస్తామని హెచ్చరించారు.
Published by: Srinivas Mittapalli
First published: December 28, 2019, 5:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading