టీఆర్ఎస్‌కో రూల్, కాంగ్రెస్‌కు మరో రూలా?.. తెలంగాణ డీజీపీకి ఉత్తమ్ లేఖ...

తెలంగాణ డీజీపీకి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు.

news18-telugu
Updated: June 12, 2020, 8:17 PM IST
టీఆర్ఎస్‌కో రూల్, కాంగ్రెస్‌కు మరో రూలా?.. తెలంగాణ డీజీపీకి ఉత్తమ్ లేఖ...
ఉత్తమ్ కుమార్ రెడ్డి( ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ డీజీపీకి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ పోలీసులు టీఆర్ఎస్ పార్టీకి ఒక రూల్, కాంగ్రెస్ పార్టీకి మరో రూల్ పాటిస్తున్నారని మండిపడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసిన లేఖను టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి, లీగల్ సెల్ చైర్మన్ దామోదర్ రెడ్డి కలసి డీజీపీ మహేందర్ రెడ్డి ని కలిసి లేఖ అందజేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ నేతలు కోవిడ్ 19 నిబంధనలు ఉల్లంఘించినా చర్యలు తీసుకోని పోలీసులు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల మీద కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. అందుకు కొన్ని ఉదాహరణలను కూడా లేఖలో పొందుపరిచారు. ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్రమంతా తిరుగుతూ, భారీ జన సమికరణతో కార్యక్రమాలు, సామాజిక దూరం, మాస్కులు లేకుండా పాల్గొంటున్నారని చెప్పారు. టీఆర్ఎస్ నాయకులు పుట్టినరోజు పార్టీలకు (నారాయణఖేడ్ సంఘటన మొదలైనవి) కోవిడ్ -19 పరిమితులు లేవని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మే 29న పదివేల మంది సమక్షంలో కొండపోచమ్మ ప్రాజెక్టును ప్రారంభించారని, అక్కడ ఎవరూ సామాజిక దూరం పాటించలేదన్నారు. అలాగే భోజనాలు కూడా ఏర్పాటు చేశారని, ఎలాంటి సామాజిక దూరం, మాస్కులు పెట్టుకోలేదని ఫిర్యాదు చేశారు. ఇక మంత్రి కేటీఆర్ జూన్ 10 న సిర్సిల్లా నియోజకవర్గంలోని బంధన్ కల్ చెరువులో వేలాది మంది ప్రజలతో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. అలాగే, మరికొందరు మంత్రులకు సంబంధించిన ఉదాహరణలను ఆ లేఖలో పొందుపరిచారు.

అదే సమయంలో ఎస్‌ఎల్‌బిసి నీటిపారుదల ప్రాజెక్టుకు వెళ్లేందుకు ప్రయత్నించిన తనను 2020 జూన్ 02 నల్గొండ పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని ఫిర్యాదు చేశారు.. తనతో పాటు, ఎంపీ కె. వెంకట్ రెడ్డి, మాజీ హోంమంత్రి కె. జానారెడ్డి కూడా అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు కోదంగల్ నియోజకవర్గంలో ఎంపీ రేవంత్ రెడ్డి, ఎస్‌ ఏ సంపత్, వంశీచంద్ రెడ్డి, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, రామ్ మోహన్ రెడ్డి, జి. చిన్న రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి తదితరులు కృష్ణ నదిపై పెండింగ్‌లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆలస్యాన్ని ప్రశ్నించడానికి వెళితే అందరిని అరెస్టులు చేశారని చెప్పారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతర ఎమ్మెల్యేలు అధిక విద్యుత్ బిల్లులపై ప్రశ్నించడానికి 2020 జూన్ 11 న సీఎం, ఇతర మంత్రులను కలవడానికి సచివాలయాన్ని సందర్శించాలని పిలుపునిచ్చారు. తనతో సహా ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులను జూన్ 11 వరకు గృహనిర్బంధం చేశారని చెప్పారు. జూన్ 13న గోదావరి నదిపై పెండింగ్ ప్రాజెక్టులను సందర్శించేందుకు వెళ్తున్న తమకు పోలీసులు అడ్డంకులు కలిగించవద్దని డీజీపీని కోరారు. ఒకవేళ తమను అడ్డుకునే లెక్క అయితే ఏ రూల్ కింద అడ్డుకుంటారో ముందే లిఖితపూర్వకంగా తెలియజేయాలని చెప్పారరు.
First published: June 12, 2020, 8:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading