Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    అంతా కాంగ్రెస్ వల్లే... కేసీఆర్‌పై మండిపడ్డ ఉత్తమ్

    కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.

    news18-telugu
    Updated: May 30, 2020, 3:55 PM IST
    అంతా కాంగ్రెస్ వల్లే... కేసీఆర్‌పై మండిపడ్డ ఉత్తమ్
    ఉత్తమ్ కుమార్, కేసీఆర్
    • Share this:
    తెలంగాణ సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ దుర్మార్గపు పాలనలో ఎవరికీ గౌరవం లేదని ఆయన ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని ఉత్తమ్ ధ్వజమత్తారు. కాంగ్రెస్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులకు శుభవార్త చెబుతానంటూ సీఎం కేసీఆర్ వారిని మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. రైతు రుణమాఫీ చేయని కేసీఆర్.. శుభవార్త చెబుతా అనడానికి సిగ్గుపడాలని మండిపడ్డారు.. రైతుబంధు, రూ.లక్ష రుణమాఫీ అందలేదని, పంటల బీమా లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు.

    కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టుల ద్వారానే సాగు నీరందుతోందని ఆయన అన్నారు. ప్రాజెక్టులపై కేసీఆర్‌ బోగస్ మాటలు మాట్లాడుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.
    Published by: Kishore Akkaladevi
    First published: May 30, 2020, 3:55 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading