మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రశంసలు.. డైనమిక్ మినిస్టర్..

సోమవారం మంత్రి కేటీఆర్ హుజూన్ నగర్ నియోజకవర్గంలో పర్యటించారు. హుజూర్‌నగర్‌లో రాజస్వ మండలాధికారి కార్యాలయంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

news18-telugu
Updated: June 29, 2020, 5:27 PM IST
మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రశంసలు.. డైనమిక్ మినిస్టర్..
సభలో మాట్లాడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • Share this:
ఒకరేమో తెలంగాణ మంత్రి కేటీఆర్. మరొకరేమో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్. ఇరు పార్టీల నేతలు నిత్యం విమర్శలు చేసుకుంటారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకుంటారు. మరి ఆ ఇద్దరు నేతలు ఒకే వేదికపై ప్రత్యక్షమైతే.. ఇంకేమైనా ఉందా..! సభలో మాటల తూటాలు పేలుతాయి.. వేదికపై వాతావరణం వేడెక్కుతుంది. అందరూ ఇలాగే అనుకుంటారు. కానీ అక్కడ మాత్రం రివర్స్‌లో జరిగింది. మంత్రి కేటీఆర్‌పై ప్రశంసలు కురిపించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.

సోమవారం మంత్రి కేటీఆర్ హుజూన్ నగర్ నియోజకవర్గంలో పర్యటించారు. హుజూర్‌నగర్‌లో రాజస్వ మండలాధికారి కార్యాలయంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సైదిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌పై ప్రశంసలు కురిపించారు ఉత్తమ్. డైనమిక్ మినిస్టర్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. టీపీసీసీ పొగడ్తలతో సభకు హాజరైనంత వారంతా అరుపులు కేకలతో చప్పట్ల మోత మోగించారు.
First published: June 29, 2020, 5:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading