ఏపీలో అలా... తెలంగాణలో ఇలా... మండిపడ్డ ఉత్తమ్

ఉత్తమ్ కుమార్ రెడ్డి( ఫైల్ ఫోటో)

కరోనా కేసులను తగ్గించడానికే రాష్ట్రంలో తక్కువ పరీక్షలు చేస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు.

  • Share this:
    తెలంగాణలో కరోనా కేసులు తక్కువగా జరగడాన్ని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుబట్టారు. ఏపీ లో 80 వేల టెస్టులు జరిగితే, ఇక్కడ 19 వేల టెస్టులు మాత్రమే జరిగాయని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా కేసులను తగ్గించడానికే రాష్ట్రంలో తక్కువ పరీక్షలు చేస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో టీటీడీపీ అధ్యక్షుడు రమణ, సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, చెరుకు సుధాకర్ పాల్గొన్నారు. కరోనా టెస్టుల విషయంలో అనుమానాస్పద వైఖరి అవలంభిస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. కరోనా ఖర్చు లెక్కలు వెంటనే చెప్పాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ డిమాండ్ చేశారు. కార్డులేని అర్హులైన వారందరికీ రేషన్ ఇవ్వాలని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. కరోనా లాక్‌డౌన్‌తో ప్రజల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ తెలిపారు. పేదలకు మరో రెండు నెలలు సహాయం అందించాలని కోరారు.


    Published by:Kishore Akkaladevi
    First published: