ఆర్టీసీ సమ్మెపై... లోక్‌సభలో ప్రస్తావిస్తామన్న ఉత్తమ్

ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీగా ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సునీల్‌శర్మ.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నట్లు హైకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించడాన్ని టీ పీసీసీ చీప్ ఉత్తమ్ తప్పుబట్టారు.

news18-telugu
Updated: November 17, 2019, 5:04 PM IST
ఆర్టీసీ సమ్మెపై... లోక్‌సభలో ప్రస్తావిస్తామన్న ఉత్తమ్
ఉత్తమ్ కుమార్ (ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో దాఖలు చేసిన తాజా అఫిడవిట్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీగా ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సునీల్‌శర్మ.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నట్లు హైకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించడాన్ని ఆయన తప్పుబట్టారు. సునీల్‌ శర్మ సమర్పించిన తప్పుడు అఫిడవిట్‌ను సుమోటాగా స్వీకరించి న్యాయస్థానం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు తాము ఎలాంటి ఆలోచనా చేయలేదని ఉత్తమ్ స్పష్టం చేశారు.

సునీల్‌శర్మ ఎవరి ప్రోద్బలంతో నిరాధార అంశంపై హైకోర్టులో అఫిడవిట్‌ వేశారని ఉత్తమ్‌ ప్రశ్నించారు. ఈ అంశాన్ని లోక్‌సభలోనూ లేవనెత్తుతానని చెప్పారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు రాజకీయ పార్టీలు కుట్ర చేసినట్లు ఆధారాలు ఉంటే అరెస్ట్‌ చేయాలని.. లేదంటే వెంటనే సునీల్‌ శర్మను డిస్మిస్‌ చేయాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ కార్మికుల పక్షాన నిరంతరం తమ పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. కార్మికులు చనిపోతున్నా... సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.


First published: November 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...