Revanth Reddy: జరిగిన దానికి చింతిస్తున్నా.. క్షమాపణ చెప్పిన రేవంత్ రెడ్డి.. ఆ వివాదానికి ఫుల్‌స్టాప్

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Revanth Reddy: ఇటీవ‌ల ఐటీ స్టాండింగ్ క‌మిటీ చైర్మ‌న్ శ‌శిథ‌రూర్ త‌న బృందంతో హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించారు. అయితే కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ పర్యటనపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సమాచారం లేదు. ఈ నేపథ్యంలోనే శశిథరూర్ పర్యటనను రేవంత్ రెడ్డి ముందు ప్రస్తావించగా మండిపడినట్టు ఓ జాతీయ మీడియా క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.

  • Share this:
    తెలంగాణ(Telangana)లో ఇప్పుడు మంత్రి కేటీఆర్ (KTR) వర్సెస్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy)వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. గురువారం వీరిద్దరి మధ్య ట్విటర్ వేదికగా మాటల యుద్ధం జరిగింది. ఐటీ రంగంలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని ప్రశంసించిన కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌ (Shashi Tharoor)ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఐతే అది తప్పుడు ప్రచారమని రేవంత్ రెడ్డి ఎదురుదాడి చేయడంతో మంత్రి కేటీఆర్ ఆడియో క్లిప్‌ను విడుదల చేశారు. అందులో శశిథరూర్‌ను రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నట్లుగా ఉంది. ఆ ఆడియో క్లిప్‌ బయటకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఎంపీ శశిథరూర్‌కు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. శశిథరూర్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని... ఆయనపై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్లు ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. తద్వారా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.

    '' ఎంపీ శశిథరూర్‌తో ఫోన్లో మాట్లాడాను. ఆయనపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా. శశిథరూర్‌ను అత్యంత గౌరవించే వ్యక్తిని నేను. ఆ వ్యాఖ్యలపై శశిథరూర్‌కు వివరణ ఇచ్చాను. జరిగిన దాని పట్ల చింతిస్తున్నా. కాంగ్రెస్‌లో విధానాలు, విలువలతో పనిచేస్తాం. వచ్చే తెలంగాణలో ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయానికి అందరం కలిసి కృషిచేస్తాం.'' అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.



    రేవంత్ రెడ్డి ఆడియోను ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.. శశిథరూర్‌పై కామెంట్స్..

    అటు ఎంపీ శశిథరూర్ కూడా ఈ అంశంపై ట్విటర్‌లో స్పందించారు. రేవంత్ రెడ్డి తనకు కాల్ చేసి, జరిగిన దానికి చింతిస్తున్నానని క్షమాపణ చెప్పారని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు ఈ సంఘటన జరిగిందని.. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తామంతా కలిసికట్టుగా పనిచేస్తామని ట్వీట్ చేశారు శశిథరూర్.



    Cabinet Meeting: మద్యం దుకాణాల్లో వాళ్లకు రిజర్వేషన్లు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

    అంతకు ముందు తెలంగాణ మంత్రి కేటీఆర్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా ఉన్న ఆడియోను ట్వీట్ చేశారు. ఈ ఆడియోలో రేవంత్ రెడ్డి కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను విమర్శించినట్టుగా ఉంది. కేటీఆర్, శశిథరూర్ ఒకటే అని.. శశిథరూర్ లాంటి వాళ్లను పార్టీ నుంచి బహిష్కరించాలని రేవంత్ రెడ్డి కామెంట్ చేసినట్టుగా ఆడియోలో ఉంది. ఓ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నలకు రేవంత్ రెడ్డి ఈ రకంగా సమాధానం ఇచ్చినట్టు ఆడియోలో ఉంది. ఈ ఆడియోను ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.. దీనిపై రేవంత్ రెడ్డి స్పందించాల్సిన అవసరం లేదని కామెంట్ చేశారు. శశిథరూర్‌పై రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌ను ఓ రిపోర్టర్ తనకు పంపించారని పేర్కొన్నారు. ఒకవేళ ఈ ఆడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తే.. ఇది ఓటుకు నోటు ఆడియోలోని రేవంత్ రెడ్డి వాయిస్‌తో మ్యాచ్ అవుతుందని కేటీఆర్ అన్నారు. ఈ ఆడియోపై కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ స్పందిస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు.



    TSRTC MD Sajjanar: ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ కీల‌క నిర్ణ‌యం.. ఇక నుంచి వాటిపై నిషేధం

    అంతకుముందు రేవంత్ రెడ్డికాంగ్రెస్ ఎంపీ శ‌శిథరూర్‌ను రేవంత్ గాడిద‌తో పోల్చిన న్యూస్ క్లిప్‌ను కేటీఆర్ ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. థ‌ర్డ్ రేట్ క్రిమిన‌ల్‌కు పార్టీ సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే ఇలానే ఉంటుంద‌ని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించినందుకు ఐటీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌ను, సొంత పార్టీకి చెందిన సీనియర్ నేతను ఇలా విమర్శిస్తారా? అని మండిపడ్డారు.


    ఇటీవ‌ల ఐటీ స్టాండింగ్ క‌మిటీ చైర్మ‌న్ శ‌శిథ‌రూర్ త‌న బృందంతో హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించారు. అయితే కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ పర్యటనపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సమాచారం లేదు. ఈ నేపథ్యంలోనే శశిథరూర్ పర్యటనను రేవంత్ రెడ్డి ముందు ప్రస్తావించగా మండిపడినట్టు ఓ జాతీయ మీడియా క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ఐతే ఇదంతా ఫేక్ న్యూస్ అని.. కేటీఆర్ అబద్ధాల కోరు అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేయడంతో, మంత్రి కేటీఆర్ ఆడియో క్లిప్‌ను విడుదల చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఎంపీ శశిథరూర్‌కు ఫోన్ చేసి క్షమాపణ చెప్పారు.
    Published by:Shiva Kumar Addula
    First published: