TPCC CHIEF REVANTH REDDY TO PROTEST IN CM KCR ADOPTED VILLAGE IN MEDCHAL ON AGUST 24 SK
Revanth Reddy: రేవంత్ రెడ్డి దూకుడు.. సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలో 48 గంటల దీక్ష..!
కేసీఆర్, రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో0
Revanth reddy: గజ్వేల్‌లో రేవంత్ రెడ్డి సభపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు తెలిసింది. పార్టీలో ఇతర నేతలతో చర్చించకుండానే సీఎం నియోజకవర్గంలో సభను ఎలా ఏర్పాటు చేస్తారని పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. పార్టీ హైకమాండ్ తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆయనలో కొత్త ఉత్సహం కనిపిస్తోంది. పార్టీ బలోపేతంపై దృష్టిసారించిన రేవంత్ రెడ్డి..ప్రజా క్షేత్రంలో తిరుగుతున్నారు. దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్‌లోని ఇంద్రవెల్లిలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ సభ జరిగింది. అది సూపర్ సక్సెస్ అయిందని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. అదే ఊపుతో ఇతర ప్రాంతాల్లోనూ దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 24న సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలో దీక్ష చేపట్టనున్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి గ్రామంలోల పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 48 గంటల దీక్ష చేపట్టనున్నట్లు సమాచారం.
ఆగస్టు 24న సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్‌లో దళిత దండోరా సభ పెట్టాలని మొదట రేవంత్ రెడ్డి భావించారు. ఐతే తక్కువ సమయంలో జనసమీకరణకు ఇబ్బందులు ఎదురవుతాయని కాంగ్రెస్ పార్టీ భావించింది. ఈ క్రమంలోనే గజ్వేల్‌లో సభకు బదులుగా సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలో దీక్ష చేపట్టాలని రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకోసం భారీ జనసమీకరణ చేయాలని వ్యూహ రచన చేస్తున్నట్లు సమచారం. నియోజకవర్గ కోఆర్డినేటర్, మూడచింతలపల్లి జెడ్పీటీసీ సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో జనసమీరణ చేయనున్నారు. ఈ దీక్షలో పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు పాల్గొనున్నారు. పార్టీ పెద్దలు హాజరయ్యే ఈ దీక్షను విజయవంతం చేసేందుకు.. గజ్వేల్, మేడ్చల్ నియోజకవర్గాల నేతలు కృషిచేయాలని హైకమాండ్ ఆదేశించినట్లు సమాచాం.
మరోవైపు గజ్వేల్‌లో రేవంత్ రెడ్డి సభపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు తెలిసింది. పార్టీలో ఇతర నేతలతో చర్చించకుండానే సీఎం నియోజకవర్గంలో సభను ఎలా ఏర్పాటు చేస్తారని పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. గజ్వేల్‌లో సభ ఏర్పాటు చేయడానికి బదులుగా మెదక్‌లో సభ ఏర్పాటు చేయాలని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజర్సింహ సూచించారని టాక్. గజ్వేల్‌లో సభ ఏర్పాటు చేసే విషయంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా అంత సుముఖంగా లేరనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ దత్తత గ్రామంలో దీక్ష చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.