Home /News /politics /

Revanth Reddy: కేసీఆర్ ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు.. ఆ అనుమానాలు వస్తున్నాయన్న రేవంత్ రెడ్డి

Revanth Reddy: కేసీఆర్ ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు.. ఆ అనుమానాలు వస్తున్నాయన్న రేవంత్ రెడ్డి

కేసీఆర్, రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో0

కేసీఆర్, రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో0

తెలంగాణపై కన్నెత్తి చూస్తే కండ్లు పీకేస్తానని కేసీఆర్ అనేవారని.. అలాంటి కేసీఆర్ ఇప్పుడు ఎందుకు నోరెత్తడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

  ఏపీ నాయకులు మళ్ళీ రాష్ట్రాల్ని కలుపుదాం అంటే టిఆర్ఎస్ నాయకులు ఎందుకు స్పందించడం లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్ర ఆలోచనగా కేసీఆర్, జగన్ వ్యూహాత్మకంగా పాచికలు కదిలిస్తున్నారన్నారు. షర్మిల పాదయాత్ర చేయడం, ప్లీనరీలో తెలుగు తల్లి బొమ్మ, ఏపీలో పార్టీ ప్రస్తావన, మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలను చూస్తుంటే.. తెలంగాణ (Telangana) ప్రజలపై ఏదో కుట్ర జరుగుతున్నట్టు కనిపిస్తోందని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దిశగా జగన్, కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ (YS Jagan Mohan Reddy) జైలుకు వెళుతాడు కాబట్టి ఉమ్మడి రాష్ట్రానికి కేసీఆర్ సీఎం కావాలని అనుకున్నట్లుగా ఉందని ఆరోపించారు.

  తెలంగాణపై కన్నెత్తి చూస్తే కండ్లు పీకేస్తానని కేసీఆర్ అనేవారని.. అలాంటి కేసీఆర్ ఇప్పుడు ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. త్యాగాలు చేసి రాష్ట్రాన్ని తెచ్చుకుంటే, కుటుంబ స్వార్థం కోసం తెలంగాణకి అన్యాయం చేస్తే, ప్రజలు చెంపలు పగులగొడ్తరని హెచ్చరించారు. కేసీఆర్ స్వార్థం ముందు, ఆయన రాక్షస క్రీడ ముందు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సమాధి అయిందని వ్యాఖ్యానించారు. నీళ్లు నిధులు నియమాల కోసం తెలంగాణ వచ్చిందన్న రేవంత్ రెడ్డి.. రాష్ట్ర ప్రజల హక్కులను జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర కేసీఆర్ పెట్టాడని మండిపడ్డారు. ప్రజలకంటే కుటుంబానికే కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తారని విమర్శించారు.

  KCR-KTR: కేటీఆర్‌కు మరిన్ని పవర్స్ ఇచ్చిన సీఎం కేసీఆర్.. వాటిపై నిర్ణయం కేటీఆర్‌దేనా ?

  Revanth Reddy: రేవంత్ రెడ్డి ‘ముందస్తు’ మాటల వెనుక మాస్టర్ ప్లాన్ ?

  గతంలో 16 మంది ముఖ్యమంత్రులు పాలించిన సెక్రటేరియల్‌ను కేసీఆర్ రాత్రిరాత్రికి కూల్చారని అన్నారు. కేటీఆర్‌ను సీఎంను చేసేందుకే సెక్రటేరియేట్‌ను కూల్చారని ఆరోపించారు. రాత్రిపూట ఫ్లడ్ లైట్‌ల మధ్య సెక్రటేరియేట్ నిర్మాణం జరుగుతుందని అన్నారు. కేసీఆర్‌కు పాలమూరు రైతుల ఉసురు తగులుతుందన్నారు. జూరాల కట్టమీద కేసీఆర్ ను ఉరితీసినా తప్పులేదని మండిపడ్డారు. ఉరితీయడమే గాకుండా కేసీఆర్ ను రాళ్లతో కొట్టాలని మండిపడ్డారు. పాలమూరు- రంగారెడ్డికి ఎన్జీటీ అనుమతి ఎందుకు సాధించలేదని కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ నిర్లక్ష్యంతోనే పాలమూరు ప్రాజెక్టు ఆగిందని.. కృష్ణా ప్రాజెక్టులపై కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదన్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Revanth reddy, Telangana

  తదుపరి వార్తలు