Home /News /politics /

TPCC CHIEF REVANTH REDDY SLAMS CM KCR AND BJP LEADERS OVER PADDY CROP ISSUE COMMENTS ON NEHRU JAYANTI MKS

revanth reddy : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు -రూ.10వేల కోట్ల సవాలు -ఢిల్లీకి సీఎం కేసీఆర్?

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

హుజూరాబాద్ లో కాంగ్రెస్ ఓటమిపై ఏఐసీసీ పోస్ట్ మార్టం తర్వాత ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ గాంధీ భవన్ లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ను, కేంద్రంలోని మోదీ సర్కారుకు కలిపి రేవంత్ కీలక సవాళ్లు విసిరారు.

ఇంకా చదవండి ...
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘోర పరాజయం తాలూకు దెబ్బ నుంచి కాంగ్రెస్ శ్రేణులు వేగంగా కోలుకునేలా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొత్త ఎత్తులతో ప్రత్యర్థులపై మాటల దాడిని ముమ్మరం చేశారు. హుజూరాబాద్ ఫలితంపై ఏఐసీసీ రివ్యూ మీటింగ్ లో ఓటమికి గల కారణాలు వివరించిన రేవంత్.. 2023లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువస్తామని భరోసా ఇచ్చారు. ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ గాంధీ భవన్ లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ను, కేంద్రంలోని మోదీ సర్కారుకు కలిపి ఆయన కీలక సవాళ్లు విసిరారు. నెహ్రూ జయంతి నేపథ్యంలోనూ రేవంత్ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. వివరాలివి..

ఆ రెండూ ఒకే గూటి పక్షులు..
వడ్ల కొనుగోలు అంశంపై కేంద్రంతో యుద్ధం చేస్తానని, దేశంలో అగ్గిపెడతానని బీరాలు పోయిన సీఎం కేసీఆర్.. కనీసం టీఆర్ఎస్ దీక్షలోనూ పాల్గొనకపోవాన్ని బట్టే ఆయన అసలు నైజమేంటో తేటతెల్లమైందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేశా చేశారు. వడ్ల కొనుగోలుపై కేంద్రంతో సీఎం కేసీఆర్ గొడవ ఉట్టి డ్రామా అని, రైతుల నుంచి ధాన్యం కొనలేకపోతే ప్రధానిగా మోదీ, సీఎంగా కేసీఆర్ ఉండీ దండగ అన్నారు. నిజానికి తెలంగాణ గల్లీల నుంచి ఢిల్లీ దాకా బీజేపీ, టీఆర్ఎస్ తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నాయని, ఒకే గూటి పక్షులు కాబట్టే బీజేపీ నేతల ర్యాలీలు, సభలకు అనుమతులు దొరుకుతున్నాయని, అదే కాంగ్రెస్ పార్టీ ఏది చేయాలన్నా పోలీసులు, అధికారులు అడుగడుగునా అడ్డుకుంటారని రేవంత్ ఆక్షేపించారు.

రూ.10వేల కోట్ల సవాలు..
వడ్ల కొనుగోలు వివాదాన్ని పరిష్కరించాలనే చిత్తశుద్ధి ఉంటే సీఎం కేసీఆర్ తానే పిలుపిచ్చిన ధర్నాలో ఎందుకు పాల్గొనలేదని రేవంత్ ప్రశ్నించారు. ప్రతి గింజ కొంటానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు చేతులెత్తేశారని మండిపడ్డారు. మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీమ్ కింద ధాన్యం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు రేవంత్. వడ్ల కొనుగోలు విషయం లో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయన్నాయని, ధనిక రాష్ట్రం అని చెప్పుకునే తెలంగాణలో రూ.10వేల కోట్లు వెచ్చించి రైతుల నుంచి ధన్యం కొనుగోలుచేయగలరా? అని సీఎం కేసీఆర్ కు రేవంత్ సవాలు విసిరారు. ఇదే సవాలు కేంద్రంలోని బీజేపీకి కూడా వర్తిస్తుందన్నారు. ప్రత్యేక బడ్జెట్ పెట్టయినా సరే వడ్లను ప్రభుత్వాలే కొనాలన్నారు.

కేసీఆర్ ఢిల్లీకి వెళతారా?
వడ్ల కొనుగోలుపై సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు, దేశంలో అగ్గి పుట్టిస్తానన్న కామెంట్లన్నీ గారడీగానే భావించాలన్న రేవంత్ రెడ్డి.. నిజంగా కేంద్రంపై పోరాడాలనుకుంటే సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి జంతర్ మంతర్ లో ధర్నా చేయాలని రేవంత్ సవాలు చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలో సాగిన ప్రజా చైతన్య యాత్రను రద్దు చేయలేదని, ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశామని, అనుమతులు రాగానే మళ్లీ మొదలుపెడతామని చెప్పారు. సభలు, పాదయాత్రలకు అనుమతులిచ్చే విషయంలో కలెక్టర్లు, పోలీసులు బీజేపీ-టీఆర్ఎస్ జంటను ఒకలా, విపక్ష కాంగ్రెస్ ను మరోలా ట్రీట్ చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.

యువతకు తప్పుడు చరిత్ర..
దేశ స్వాతంత్య్రం కోసం పదేళ్లపాటు జైలులో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం దేశ ప్రజలకు పండుగ లాంటిదని, బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకు విషెస్ చెబుతున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. దేశ స్వాతంత్ర్యంలో ఎలాంటి పాత్ర లేనివారిని దేశ భక్తులుగా చూపిస్తున్నారని, నేటి యువతకు తప్పుడు చరిత్రను చూపిస్తున్నారని మండిపడ్డారు. కొంతమంది చరిత్రను వక్రీకరిస్తూ కొత్త దేశభక్తుల అవతరమెత్తారు. దేశం కోసం త్యాగం చేసిన మహా నేతలను అవమానపరిచే విదంగా ప్రవరిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, CM KCR, Congress, Revanth reddy, Tpcc

తదుపరి వార్తలు