Home /News /politics /

TPCC CHIEF REVANTH REDDY OBJECTED TO TELANGANA CM KCR INSULTING PRIME MINISTER NARENDRA MODI AND COMMENTING ON WHAT TELANGANA REPUTATION SHOULD BE LIKE IF HE SPOKE LIKE THAT PRV

TS Congress: ప్రధాని మోదీని కేసీఆర్​ తిట్టడంపై టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి అభ్యంతరం..  అలా మాట్లాడకూడదంటూ హితవు

కేసీఆర్, రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

కేసీఆర్, రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్​ మోదీపై యుద్ధం ప్రకటిస్తారనుకుంటే అలా చేయలేదని టీపీసీసీ చీఫ్​ రేవంత్​ ఎద్దేవా చేశారు. బడ్జెట్​ సమావేశాలకు హాజరైన అనంతరం ఢిల్లీలో రేవంత్​ మీడియాతో మాట్లాడారు.

    దేశ ప్రధాని నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi)పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR)​ వాడిన భాషను వ్యతిరేకిస్తున్నట్లు టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి (TPCC Chief Revanth Reddy) అన్నారు.  నిర్మలా సీతారామన్​, మోదీల గురించి జుగుప్సాకరంగా మాట్లాడారని పేర్కొన్నారు రేవంత్​. భారత దేశంలో మహిళలను గౌరవించే సంస్కృతి ఉందని రేవంత్​ అన్నారు. సీఎం కేసీఆర్​ మోదీపై యుద్ధం ప్రకటిస్తారనుకుంటే అలా చేయలేదని రేవంత్​ ఎద్దేవా చేశారు. బడ్జెట్​ సమావేశాలకు (Budget sessions) హాజరైన అనంతరం ఢిల్లీలో రేవంత్​ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ సిద్ధాంత పరంగా బీజేపీని వ్యతిరేకిస్తాం ..కానీ కేసీఆర్ భాషను సమర్థించం. ప్రధాన మంత్రిని ఉద్దేశించి ముఖ్యమంత్రి అసభ్యంగా మాట్లాడితే తెలంగాణ పరువు ఏం కావాలి. కేసీఆర్ భాషను సభ్య సమాజం క్షమించదు. మహిళలను గౌరవించే సంస్కృతి భారత సంస్కృతి. కేసీఆర్ భాష (KCR language) ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో సమాధానం చెప్పాలి. దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు మేలు చేసేది కాంగ్రెస్ పార్టీనే. విభజన హామీలు అమలు కావాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యం.

    బడ్జెట్​పై రేవంత్..

    ఇక కేంద్ర బడ్జెట్ (Union Budget 2022)​పై రేవంత్​ విమర్శలు గుప్పించారు. ‘‘రైతులకు మేలు, యువకులకు ఉపాధి, మహిళలకు రక్షణ వేటికి ప్రాధాన్యత లేదు. మోడీ బడ్జెట్ తో దేశానికి మేలు జరగదు. కేసీఆర్ ప్రెస్ మీట్ లో మర్యాద లేదు. మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించి నందుకు రైతులపై కక్షగట్టి వ్యవసాయ రంగానికి కేటాయింపులు తగ్గించారు.

    కేంద్ర బడ్జెట్ నిరాశ పరిచింది..

    ఎరువుల సబ్సిడీ తగ్గించారు. పంటలకు మద్దతు ధర (MSP) తెస్తారని ఆశించాం. రైతుల పోరాటం చూసైనా పంటల మద్దతు ధరకు చట్టబద్దత కల్పించలేదు. కేంద్ర బడ్జెట్ నిరాశ పరిచింది. గోధుమలు, వరికి కొనుగోళ్లకు నిధులు తగ్గించారు. ఉపాధిహామీ పధకానికి నిధులు తగ్గించారు

    రైతుల ఆదాయాన్ని (Farmers Income) రెండింతలు చేయలేదు. పంట పెట్టుబడి రెండింతలయ్యేలా ఎరువుల సబ్సిడీ తగ్గించారు. జీఎస్టీ విధానంలో మార్పులు చేయలేదు. ఉద్యోగస్తుల కోసం ఎటువంటి నిర్ణయాలు బడ్జెట్ లో లేవు. వైద్య మౌలిక వసతుల కోసం నిధుల కేటాయింపులు లేవు.

    కరోనా ప్రభావం చూశాక కూడా పేదలకు వైద్యం అందించే చర్యలకు కేటాయింపులు లేవు. సాంకేతిక విద్య పేదలకు చేరువ చేయడానికి ప్రయత్నాలు లేవు. వ్యవసాయ రంగం కుంటుపడే పరిస్థితి వచ్చింది. విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, ఆరోగ్యం ఎవరికి ఉపయోగ పడే నిర్ణయాలు లేవు. ధరలు తగ్గించెందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఎలక్ట్రానిక్స్, బంగారం, వజ్రాలపై ధరలు తగ్గించారు. సంపన్నులకు మేలు చేసేలా 10 శాతం మందికి ప్రయోజనం చేకూరేలా బడ్జెట్ ఉంది.

    మోదీపై యుద్ధం ప్రకటిస్తారని ఆశించాం..

    తెలంగాణ విభజన అంశాలకు (For the division of Telangana) బడ్జెట్ లో కేటాయింపులు లేవు. కేంద్ర బడ్జెట్ గంటన్నర ఉంటే కేసీఆర్ రెండున్నర గంటలు ఏకపాత్రాభినయం చేశారు. కల్తీ మందు తాగి వచ్చినట్లు మాట్లాడారు. విభజన చట్టం అంశాలు,కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, ఎన్టీపీసీ యూనిట్ ,రైల్వే లైన్లు, జాతీయ రహదారుల విషయం ఏదీ మాట్లాడలేదు. మోదీపై యుద్ధం ప్రకటిస్తారని ఆశించాం. నిర్మలా సీతారామన్, మోదీ గురించి నీచంగా, జుగుప్సాకరంగా కేసీఆర్ మాట్లాడారు.

    రాజ్యాంగం రద్దుపై..

    రాజ్యాంగాన్ని రద్దు (Repeal the Constitution) చేయాలని మాట్లాడారు. భూస్వాములు, అగ్ర వర్ణాల కోసం రాజ్యాంగాన్ని మార్చాలన్న బిజెపి మాటలను కేసీఆర్ మాట్లాడినట్లు ఉంది. రాజ్యాంగాన్ని సవరించుకునే అవకాశం ఉంది. రాజ్యాంగ సవరణ ద్వారా దళితులు, బలహీన వర్గాలకు మేలు చేసే ప్రయత్నం చేయాలి. రాజ్యాంగం మార్చలన్నది బిజెపి కుట్ర... బిజెపి కుట్రకు కేసీఆర్ వంత పాడారు. రాజ్యాంగం రద్దు చేయాలని బిజెపి ఎన్నో ఏళ్లుగా కుట్ర చేస్తుంది. కేసీఆర్ ను ముందుంచి రాజ్యాంగం రద్దు అంశాన్ని తెరమీడికి తెచ్చారు. బీజేపీ రాజ్యాంగం రద్దు కుట్రకు కేసీఆర్ మద్దతు తెలిపారు అన్ని జిల్లా,మండల కేంద్రాల్లో అంబెడ్కర్ విగ్రహం ముందు కేసీఆర్ దిష్టి బొమ్మలు దగ్దమ్ చేయాలి. కేసీఆర్ రాజ్యాంగం రద్దు ఆలోచనను ఉపసంహరించుకునేందుకు రెండు రోజుల పాటు గాంధీ భవన్ లో నిరసన దీక్షలు  చేయాలి. రాజ్యాంగం రద్దు ఆలోచనను ఉపసంహరించుకొకపోతే దేశ యువత కేసీఆర్ నాలుక కొస్తారు. యూపీలో బీజేపీ గెలిపించాలన్న ఆలోచన కేసీఆర్ చేస్తున్నారు. కేసీఆర్ అసదుద్దీన్ ఒవైసీ సూపరి గ్యాంగ్. యూపీ ఎన్నికల్లో బీజేపీ ని గెలిపించడానికి సుపారి తీసుకున్నారు. ఓట్లు చీల్చడానికి ఎంఐఎం పోటీ చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అసభ్యకరమైన భాష మాట్లాడారు. కేసీఆర్ భాషను ఖండిస్తున్నాం”అని రేవంత్​ అన్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Congress, Revanth Reddy, Tpcc

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు