హోమ్ /వార్తలు /National రాజకీయం /

Revanth Reddy: హుజూరాబాద్‌ విషయంలో రేవంత్‌రెడ్డి ఈ లాజిక్ మిస్సయ్యారా ?

Revanth Reddy: హుజూరాబాద్‌ విషయంలో రేవంత్‌రెడ్డి ఈ లాజిక్ మిస్సయ్యారా ?

హుజూరాబాద్, రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

హుజూరాబాద్, రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Revanth Reddy: రేవంత్ రెడ్డి మొదటి నుంచి హుజూరాబాద్‌పై పెద్దగా ఫోకస్ చేసినట్టు కనిపించలేదు. ఓ ఇంటర్వ్యూలో హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిచి చాలా ఏళ్లు అవుతుందని.. అయినా ఈ ఎన్నికలు ప్రజలు కోరుకుంటే వచ్చినవి కాదని అన్నారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితం టీఆర్ఎస్‌ను ఎంతగా ఇబ్బందిపెడుతుందో.. ప్రతిపక్ష కాంగ్రెస్‌ను అంతకంటే ఎక్కువగానే బాధిస్తోంది. టీఆర్ఎస్‌పై ఈ ఉప ఎన్నికల ఫలితం ప్రభావం ఎలా ఉంటుందనే విషయం ఎవరికీ అర్థంకావడం లేదు. అయితే కాంగ్రెస్‌లో మాత్రం ఈ ఉప ఎన్నిక రిజల్ట్ రచ్చ రచ్చకు దారి తీసింది. ఆ పార్టీ పీఏసీ సమావేశంలో నేతలు ఒకరినొకరు టార్గెట్ చేసుకున్నారు. మరీ ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసేందుకు కొంతకాలంగా ఎదురుచూస్తున్న పలువురు నేతలు.. ఈ ఉప ఎన్నిక ఫలితాన్ని అందుకోసం ఉపయోగించుకున్నారనే చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన తరువాత వచ్చిన ఉప ఎన్నిక కావడంతో.. ఆయన ఇక్కడ కాంగ్రెస్ గౌరవప్రదమైన ఓట్లు సాధించేందుకు ప్రయత్నిస్తారని అంతా అనుకున్నారు.

కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఘోరమైన ఫలితాలు చవిచూసింది. అయితే రేవంత్ రెడ్డి మొదటి నుంచి హుజూరాబాద్‌పై పెద్దగా ఫోకస్ చేసినట్టు కనిపించలేదు. ఓ ఇంటర్వ్యూలో హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిచే చాలా ఏళ్లు అవుతుందని.. అయినా ఈ ఎన్నికలు ప్రజలు కోరుకుంటే వచ్చినవి కాదని అన్నారు. అయినా రాష్ట్రంలో పార్టీని కిందనుంచి బలోపేతం చేయాలని భావించిన రేవంత్ రెడ్డి.. ఈ ఎన్నికల మీద దృష్టి పెట్టడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని అనుకున్నట్టు వార్తలు వచ్చాయి. హుజూరాబాద్‌లో రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించినప్పటీ.. కాంగ్రెస్ పార్టీకి మాత్రం పెద్దగా ఓట్లు రాలేదు.

2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 60 వేల వరకు ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 3 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ అక్కడ 50 వేలకు పైగా ఓట్లు కోల్పోవడం ఆ పార్టీకి మింగుడుపడటం లేదు. అయితే ఈ రకమైన ఫలితాలు వస్తే.. దాని పర్యవసానాలు ఈ రకంగా ఉంటాయని రేవంత్ రెడ్డి ఊహించి ఉండకపోవచ్చని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఈ విషయంలో రేవంత్ రెడ్డి లాజిక్ మిస్ అయి ఉండవచ్చనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

త్వరలోనే తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. బీజేపీ ఎమ్మెల్యే జోస్యం

టీఆర్ఎస్‌కు మాత్రమే కాదు.. ఆ నేతకు కూడా ‘హుజూరాబాద్’ పెద్ద దెబ్బ.. ఇమేజ్‌కు డ్యామేజ్ ?

హుజూరాబాద్ ఫలితం బీజేపీ గెలుపు కాదని.. అది కేవలం ఈటల రాజేందర్ గెలుపు మాత్రమే అని కాంగ్రెస్ ఎంతగా చెబుతున్నప్పటికీ... కాంగ్రెస్ ఓట్లు పూర్తిగా బీజేపీ, టీఆర్ఎస్ పంచుకోవడం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది. దీంతో హుజూరాబాద్ ఫలితం ఎలా ఉన్నా.. దాని ప్రభావం పార్టీ మీద, తన మీద ఉండదని అనుకున్న రేవంత్ రెడ్డికి ఇప్పుడిప్పుడే దీని ఎఫెక్ట్ తెలుస్తోందనే చర్చ జరుగుతోంది.

First published:

Tags: Revanth Reddy, Telangana

ఉత్తమ కథలు