హోమ్ /వార్తలు /రాజకీయం /

ఎమ్మెల్యే పదవికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రాజీనామా

ఎమ్మెల్యే పదవికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రాజీనామా

రాజీనామా లేఖను అందిస్తున్న ఉత్తమ్

రాజీనామా లేఖను అందిస్తున్న ఉత్తమ్

హుజూర్‌నగర్ ఉపఎన్నికలో తన భార్య పద్మావతిని బరిలోకి దించేందుకు ఉత్తమ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పేరు కూడా తెరపైకి వస్తోంది.

  ఎమ్మెల్యే పదవికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా ఎన్నికై నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే పదవిని వదులుకోవాల్సి వచ్చింది. బుధవారం సాయంత్రం తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిని కలిసి రాజీనామా లేఖను అందించారు. ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయడంతో హుజూర్‌నగర్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. త్వరలోనే అక్కడ ఎన్నిక జరగనుంది.


  హుజూర్‌నగర్ ఉపఎన్నికలో తన భార్య పద్మావతిని బరిలోకి దించేందుకు ఉత్తమ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పేరు కూడా తెరపైకి వస్తోంది. వీరిద్దరిలో ఎవరో ఒకరు పోటీచేస్తారని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీచేస్తారన్నది తెలియాల్సి ఉంది.


  డిసెంబరులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు టీపీీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిపై 6వేల ఓట్ల మెజార్టీతో ఆయన గెలిచారు. అనంతరం ఐదు నెలల్లోనే లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోవడంతో లోక్‌సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను దింపాలని నిర్ణయించిన హైకమాండ్ నల్గొండ ఎంపీ స్థానానికి ఉత్తమ్‌ని బరిలోకి దింపింది. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డిని ఓడించి ఎంపీగా గెటిచారు ఉత్తమ్.

  First published:

  Tags: Nalgonda, Telangana, Trs, TS Congress, Uttam Kumar Reddy

  ఉత్తమ కథలు