కాంగ్రెస్ అధిష్ఠానం మాజీ ఎంపీ విజయశాంతిపై ఏమాత్రం నమ్మకాన్ని కోల్పోలేదు. ఆమెనే తమ స్టార్ క్యాంపెయినర్‌గా భావిస్తోంది. అందుకే తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్‌గా విజయశాంతిని నియమించింది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన విజయశాంతి.. తనపై నమ్మకముంచి ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి ధన్యవాదాలు చెప్పారు.
వందకు వంద శాతం తన బాధ్యతను నిర్వర్తిస్తానని.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక సీట్లు సాధించేందుకు కృషిచేస్తానని చెప్పారు. ఇక, ఎంపీగా తాను పోటీ చేసే అంశంపై అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈనెలలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందన్నారు.
పనిలో పనిగా అన్న కేసీఆర్‌పైనా తనదైన స్టైల్‌లో సెటైర్ వేశారీ చెల్లెలు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మాయమాటలు చెప్పి గెలిచారని, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెబుతారని విజయశాంతి అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కేసీఆర్, మోదీలిద్దరూ విఫలమయ్యారని విమర్శించారు. కేసీఆర్ ఏర్పాటు చేయబోయేది ఫెడరల్ ఫ్రంట్ కాదని, ఫెడో ఫ్రంట్ అని ఎద్దేవా చేశారు. ఆయన మోదీకి బీ టీమ్‌గా మారిపోయారని సెటైర్ వేశారు. ఇక కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు గెలిపించింది హోమాలు,యాగాలు చేయడానికా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఫామ్ హౌజ్‌ను వీడి ప్రజల్లోకి రావాలన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Congress, Pm modi, Telangana, Telangana Election 2018, Telangana News, Tpcc, Trs, Vijayashanti