Home /News /politics /

TPCC ANNOUNCED COMMITTEES FOR GHMC ELECTIONS NS

GHMC ఎన్నికలపై అప్రమత్తమైన కాంగ్రెస్.. కీలక కమిటీల ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తున్న ఆ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎన్నికల కమిటీలను ప్రకటించింది.

    జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తున్న ఆ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎన్నికల కమిటీలను ప్రకటించింది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి అంజన్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, జాఫర్ జావేద్, నిరంజన్, షేక్ అబ్ధుల్లాతో కమిటీని నియమించారు. ఈ నియోజకవర్గానికి పీసీసీ కో ఆర్డినేటర్ గా మాజీ మంత్రి షబ్బీర్ అలీని నియమించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి వీ. హనుమంతరావు, మర్రి శశిధర్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, పీ. విష్ణువర్ధన్ రెడ్డి, దాసోజు శ్రవణ్, సంతోష్ కుమార్ తో కమిటీని నియమించారు. ఈ స్థానానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీసీసీ కో ఆర్డినేటర్ గా వ్యవహరించనున్నారు.

    జీహెచ్ఎంసీ పరిధిలోని చేవెళ్ల పార్లమెంట్ స్థానానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అజారుద్దీన్, చల్లా నర్సింహారెడ్డి, భిక్షపతి యాదవ్, రాచమళ్ల సిద్ధేశ్వర్, దీపాభాస్కర్ రెడ్డితో కమిటీని నియమించారు. ఈ స్థానంలో పీసీసీ కో ఆర్డినేటర్ గా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యవహరించనున్నారు.  మాల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానానికి ఎంపీ రేవంత్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, చల్లా నర్సింహారెడ్డి, నందికంటి శ్రీధర్, బడే సాబ్ తో కమిటీని పీసీసీ ప్రకటించింది. ఈ నియోజకవర్గానికి పీసీసీ కో ఆర్డినేటర్ గా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యవహరించానున్నారు.

    మెదక్ పార్లమెంట్ స్థానానికి మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహా, విజయశాంతి, గీతారెడ్డి, జగ్గారెడ్డి, గాలి అనిల్ కుమార్ ను నియమించింది. ఇక్కడ పీసీసీ కో ఆర్డినేటర్ గా జెట్టి కుసుమ కుమార్ ను నియమించారు. ఈ రోజు సాయంత్రం ఎలక్షన్ మనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ కమిటీ ప్రకటించనున్నట్లు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రేపటి లోగా అభ్యర్థులు ఖరారు చేస్తామన్నారు.  19వ తేదీన అభ్యర్థులకు బీ. ఫాం అందిస్తామన్నారు. 21 న కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Hyderabad - GHMC Elections 2020, Tpcc

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు