జగన్‌కు చిత్తూరు చిక్కులు తప్పవా ? వైసీపీలో ఆసక్తికర చర్చ

మిగతా జిల్లాల సంగతి ఎలా ఉన్నా... చిత్తూరు జిల్లా నుంచి జగన్ కేబినెట్‌లో చోటు ఆశిస్తున్న వారిలో మాత్రం అంతకంతకూ పెరుగుతోందని రాజకీయవర్గాలతో పాటు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం... ఈ జిల్లా నుంచి కేబినెట్ బెర్త్ ఆశించే నేతల సంఖ్య అరడజనుకు పైగా ఉండటమే.

news18-telugu
Updated: April 30, 2019, 11:47 AM IST
జగన్‌కు చిత్తూరు చిక్కులు తప్పవా ? వైసీపీలో ఆసక్తికర చర్చ
వైఎస్ జగన్మోహన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ ఎన్నికల్లో విజయం ఎవరిదనే విషయం తేలడానికి మరికొన్ని వారాల సమయం ఉంది. అయితే ఈసారి విజయం వైసీపీదే అని ఎన్నికలకు ముందే పలు సర్వేలు అంచనా వేయడంతో... ఆ పార్టీ గెలుపు ఖాయమనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వైసీపీలో పదవుల పందేరం ఎలా ఉండనుందనే దానిపై కూడా ఎన్నికలు పూర్తయిన కొద్ది రోజుల నుంచే చర్చ జరుగుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాతే మంత్రివర్గం ఏర్పాటుకు సంబంధించిన చర్చ మొదలుపెడతానని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవులు ఆశిస్తున్న నేతలకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అయితే వైసీపీ ప్రభుత్వంలో తమకు చోటు దక్కుతుందా లేదా అనే టెన్షన్ ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది.

మిగతా జిల్లాల సంగతి ఎలా ఉన్నా... చిత్తూరు జిల్లా నుంచి జగన్ కేబినెట్‌లో చోటు ఆశిస్తున్న వారిలో మాత్రం అంతకంతకూ టెన్షన్ పెరుగుతోందని రాజకీయవర్గాలతో పాటు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం... ఈ జిల్లా నుంచి కేబినెట్ బెర్త్ ఆశించే నేతల సంఖ్య అరడజనుకు పైగా ఉండటమే. మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, నారాయణస్వామి సహా పలువురు నేతలు చిత్తూరు జిల్లా నుంచి జగన్ కేబినెట్‌లో చోటు ఆశిస్తున్నారు.

టీడీపీ ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేసిన రోజా, పెద్దిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వాళ్లు కచ్చితంగా తమకు మంత్రి పదవులు దక్కుతాయని భావిస్తుంటే... ఎస్సీ కోటాలో తనకు ఛాన్స్ ఉంటుందని నారాయణస్వామి ఆశగా ఉన్నారు. అయితే మంత్రి పదవి ఆశిస్తున్న వాళ్లెవరికీ కాకుండా చంద్రబాబుపై గెలిస్తే వైసీపీ అభ్యర్థి చంద్రమౌళిని మంత్రిని చేస్తానని జగన్ హామీ ఇవ్వడం విశేషం. మొత్తానికి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు నుంచి కేబినెట్‌లోకి ఎవరిని తీసుకోవాలనే దానిపై జగన్ నిర్ణయం తీసుకోవడం కష్టమే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

First published: April 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>