టీ పీసీసీ రేసులో రేవంత్ రెడ్డికి గట్టి పోటీ ?

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వ మార్పు జరిగితే టీపీసీసీ చీఫ్ విషయంలో రేవంత్ రెడ్డికి మాజీమంత్రి నుంచి గట్టి పోటీ ఎదురుకావొచ్చనే ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: August 26, 2019, 2:56 PM IST
టీ పీసీసీ రేసులో రేవంత్ రెడ్డికి గట్టి పోటీ ?
రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
చాలా ఏళ్లుగా టీ పీసీసీ చీఫ్‌గా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని త్వరలోనే మారుస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో సాగుతోంది. జాతీయస్థాయిలో కాంగ్రెస్‌కు కొత్త బాస్ ఎంపిక అయిన వెంటనే రాష్ట్రంలో కాంగ్రెస్ చీఫ్ మార్పు తప్పదని పార్టీలో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని ఆ పార్టీ నేతలు నిరుత్సాహంగా ఉన్నప్పటికీ... టీ పీసీసీ చీఫ్ పదవి దక్కించుకోవాలనే విషయంలో మాత్రం చాలామంది నేతలు తమవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ మార్పు జరిగితే... అందరికంటే ఎక్కువ అవకాశాలు ప్రస్తుత టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఉన్నారనే టాక్ ఉంది. రేవంత్ రెడ్డి సైతం తాను కచ్చితంగా కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ప్రకటించి... టీపీసీసీ చీఫ్‌గా తన పేరును పరిశీలించాలని కాంగ్రెస్ పెద్దలకు సంకేతాలు పంపించారు.

అయితే ఈ విషయంలో రేవంత్ రెడ్డికి మరో కాంగ్రెస్ నేత నుంచి గట్టి పోటీ ఎదురుకావొచ్చనే టాక్ పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, మాజీమంత్రి శ్రీధర్ బాబు కూడా టీ పీసీసీ చీఫ్ పదవి కోసం తనవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారని ప్రచారం జరుగుతోంది. టీ పీసీసీ చీఫ్ మార్పు అంటూ జరిగితే... ఈ సారి తన పేరును పరశీలించాలని ఆయన కోరుతున్నట్టు సమాచారం. ఉత్తర తెలంగాణలో బలహీనపడ్డ కాంగ్రెస్ పార్టీని మళ్లీ గాడిలో పెట్టడానికి తనకు ఛాన్స్ ఇవ్వాలని ఆయన అధిష్టానానికి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వ మార్పు జరిగితే రేవంత్ రెడ్డికి అంత ఈజీగా టీ పీసీసీ చీఫ్ పోస్టు దక్కే అవకాశాలు కనిపించడం లేదు.


First published: August 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు