బాలకృష్ణ సీటుపై కన్ను... వైసీపీలో పోటాపోటీ

Nandamuri balakrishna | టీడీపీ ఆవిర్భావం నుంచి తమ పార్టీ ఖాతాలోనే ఉన్న హిందూపురం స్థానం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి సత్తా చాటారు బాలకృష్ణ. హిందూపురం నుంచి రెండుసార్లు వరుసగా విజయం సాధించిన బాలకృష్ణ... రెండుసార్లు వేర్వేరు ప్రత్యర్థులను ఎదుర్కొన్నారు.

news18-telugu
Updated: July 31, 2019, 3:16 PM IST
బాలకృష్ణ సీటుపై కన్ను... వైసీపీలో పోటాపోటీ
నందమూరి బాలకృష్ణ(File)
  • Share this:
ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బలంగా వీచిన వైసీపీ హవాను తట్టుకుని కేవలం కొంతమంది టీడీపీ నేతలు మాత్రమే విజయం సాధించారు. ఇక రాయలసీమలో జగన్ ప్రభంజనాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు సహా కేవలం ముగ్గురు నేతలు మాత్రమే తట్టుకున్నారు. అందులో సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఒకరు. దశాబ్దాల నుంచి టీడీపీ కంచుకోటగా ఉంటూ వస్తున్న హిందూపురంలో ఈ సారి వైసీసీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ నేతలు భావించారు. అయితే టీడీపీ ఆవిర్భావం నుంచి తమ పార్టీ ఖాతాలోనే ఉన్న హిందూపురం స్థానం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి సత్తా చాటారు బాలకృష్ణ.

హిందూపురం నుంచి రెండుసార్లు వరుసగా విజయం సాధించిన బాలకృష్ణ... రెండుసార్లు వేర్వేరు ప్రత్యర్థులను ఎదుర్కొన్నారు. వైసీపీ తరపున 2014లో నవీన్ నిశ్చల్, 2019లో మహ్మద్ ఇక్బాల్ బాలకృష్ణపై పోటీ చేసి ఓడిపోయారు. వీరిలో మహ్మద్ ఇక్బాల్‌కు ఎమ్మెల్సీ సీటు ఇస్తానని సీఎం జగన్ బహిరంగంగా ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉన్నా... వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచి వైసీపీ తరపున పోటీ చేయబోయేది ఎవరనే అంశం జిల్లా రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

హిందూపురం వైసీపీ ఇన్‌చార్జ్ పోస్టు తనదే అని మహ్మద్ ఇక్బాల్ భావిస్తుంటే... ఆ పోస్టు తనకు కావాలని గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన నవీన్ నిశ్చల్ పార్టీ అధినాయకత్వాన్ని కోరుతున్నట్టు సమాచారం. ఇప్పుడు నియోజకవర్గ ఇన్ చార్జ్ పదవి ఎవరికి దక్కితే... రాబోయే ఎన్నికల్లో సీటు వారిదే అనే ధీమాలో ఈ ఇరువురు నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. మరి... బాలకృష్ణ చేతిలో ఓడిన మహ్మద్ ఇక్బాల్‌కు హిందూపురం ఇన్‌ఛార్జ్ బాధ్యతలు కూడా దక్కుతాయా ? లేక నవీన్ నిశ్చల్‌కు జగన్ ఛాన్స్ ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.First published: July 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు