TodayNewsRoundup: నేటి ప్రధాన వార్తాంశాలు..

#TopNewsRoundup: దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న నేటి కీలక పరిణామాలకు సంబంధించిన వార్తల సమాహారాన్ని న్యూస్18 తెలుగు మీకోసం ప్రత్యేకంగా అందిస్తోంది.

news18-telugu
Updated: December 28, 2018, 9:58 PM IST
TodayNewsRoundup: నేటి ప్రధాన వార్తాంశాలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏంటి విజ‌య్ దేవ‌ర‌కొండ పెళ్లి చేసుకుంటున్నాడా..? అమ్మో ఈ విష‌యం తెలిసి ఎంత‌మంది అమ్మాయిల గుండెలు బెలూన్స్‌లా పేలిపోతాయో క‌దా.. ఎందుకంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ తెలుగు ఇండ‌స్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్. ఈయ‌న త‌న‌కు కాబోయే అమ్మాయి ఎలా ఉండాలో చెప్పాడు. పైగా త‌న‌కు ఏ ఊరు అమ్మాయి కావాలో కూడా క్లారిటీ ఇచ్చాడు విజ‌య్. READ FULL ARTICLE

ఉమ్మడి హైకోర్టు విభజనపై నిరసన తెలుపుతున్న ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు. జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌కు కొత్త హైకోర్టును ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి రామ్ ‌నాథ్ కోవింద్ రెండు రోజుల క్రితం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. READ FULL ARTICLE

రాజమౌళి తనయుడు కార్తికేయ పెళ్లి జైపూర్‌లో జరగనుంది. డిసెంబర్ 30న వీళ్ళ పెళ్లి సౌత్ ఇండియన్ స్టైల్లో జరగనుంది. మూడు రోజుల పాటు ఘనంగా వీళ్ల పెళ్లి జరగబోతుంది. దీనికి టాలీవుడ్ నుంచే కాకుండా బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. ఇక కార్తికేయ పెళ్లి కోసం టాలీవుడ్ హీరోలు, రాజమౌళితో సన్నిహితంగా ఉండే స్నేహితులు అంతా జైపూర్ వెళ్లిపోయారు.  CLICK FOR PHOTOGALLERY

దేశంలోని ఇళ్లు లేని వారికి గూడు కల్పించడం ప్రభుత్వం బాధ్యత. ఇదే లాజిక్‌ను పట్టుకుని రాముడికి ఓ ఇల్లు కట్టివ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఓ బీజేపీ ఎంపీ. ప్రధానమంత్రి ఆవాసయోజన కింద అయోధ్యలో శ్రీరాముడికి ఓ ఇల్లు కట్టివ్వాలని ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ హరి నారాయణ్ రాజ్బర్ డిమాండ్ చేశారు.  READ FULL ARTICLE

జీఎస్టీ డిపార్ట్‌మెంట్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు కౌంటర్ ఇచ్చారు. జీఎస్టీ శాఖ చెబుతున్నట్టుగా 2007-08 ఏడాదిలో అంబాసిడర్ సేవలు ఎలాంటి పన్ను పరిధిలోకి రావని మహేష్ బాబు తరఫు న్యాయవాదులు స్పష్టం చేశారు. READ FULL ARTICLE

కేసీఆర్ మరోసారి యాగం చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. జనవరి 21 నుంచి ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆయన ఈ యాగాన్ని నిర్వహించబోతున్నట్టు సమాచారం. దీనిపై ఆయన త్వరలోనే అధికారికంగా ప్రకటన విడుదల చేస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. READ FULL ARTICLE

కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎగ్గుపెట్టేందుకు వచ్చిన ఏ అవకాశాన్నీ జారవిడుకోవడం లేదు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీపై మోదీ సర్కారు పగబట్టిందని పదేపదే ఆరోపిస్తున్న చంద్రబాబు...రెండ్రోజుల క్రితం జరిగిన హైకోర్టు విభజన తీరును కూడా తప్పుబట్టారు. తాజాగా విశాఖ ఉత్సవ్‌లో ఎయిర్ షో రద్దు కావడం..కేంద్రం పనేనంటూ ఆయన ధ్వజమెత్తారు. READ FULL ARTICLE

సార్వత్రిక ఎన్నికల  ముంగిట కాంగ్రెస్ పార్టీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రూపంలో కొత్త చిక్కు వచ్చిపడింది. ఆయన ప్రధాని మంత్రి కావడానికి దారితీసిన పరిస్థితులపై బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ మూవీ కాంగ్రెస్ పార్టీలోనే కాదు..దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.  అంతేకాదు విడుదలకు ముందే ఈ మూవీపై వివాదాలు ముసురు కుంటున్నాయి. READ FULL ARTICLE

భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ట్రెడిషనల్ టెస్ట్‌ ఫార్మాట్‌లో రికార్డ్‌ల మోత మోగిస్తున్నాడు. ఇంటర్నేషనల్ టెస్ట్‌‌ల్లో ఎంట్రీ ఇచ్చిన ఏడాదిలోనే అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా చరిత్రను తిరగరాశాడు. ఈ ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనతో అంతర్జాతీయ టెస్ట్‌ల్లో అరంగేట్రం చేశాడు.READ FULL ARTICLE

పదవుల్లో లేకపోయినా సరే పాపులారిటీలో మాత్రం తామే టాప్ అని నిరూపిస్తున్నారు ఒబామా దంపతులు. అమెరికన్ల ఆరాధ్యుడిగా వరుసగా 11వ ఏడాది మాజీ అధ్యక్షుడు ఒబామా తొలి స్థానంలో నిలవగా.. మహిళా విభాగంలో మిషెల్ ఒబామా తొలిసారి టాప్‌ స్థానాన్ని దక్కించుకున్నారు. READ FULL ARTICLE
Published by: Srinivas Mittapalli
First published: December 28, 2018, 9:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading