లండన్ టు రావాల్పిండి : షరీఫ్ కేసులో 18 కీలక ఘట్టాలు

నవాజ్ షరీఫ్ అరెస్టుతో పాక్‌లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల ర్యాలీల్లో మానవబాంబులు పేలుతున్నాయి.

Ashok Kumar Bonepalli | news18-telugu
Updated: July 14, 2018, 12:31 AM IST
లండన్ టు రావాల్పిండి : షరీఫ్ కేసులో 18 కీలక ఘట్టాలు
నవాజ్ షరీఫ్, కుమార్తె మార్యం షరీఫ్
 • Share this:
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మార్యం షరీఫ్‌ను పాక్ రేంజర్స్ అరెస్ట్ చేశారు. పనామా పేపర్స్ లీక్ కేసులో నవాజ్ మీద వచ్చిన అవినీతి ఆరోపణలు రుజువుకావడంతో ఈనెల 6న స్థానిక కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించింది. షరీఫ్ కు పదేళ్లు, ఆయన కుమార్తెకు ఏడేళ్ల కారాగార శిక్ష విధించింది. భారీగా జరిమానా కూడా కట్టాలని ఆదేశించింది. దీంతో పోలీసులకు లొంగిపోయేందుకు షరీఫ్ లండన్ నుంచి అబుదాబి మార్గంలో లాహోర్ చేరుకున్నారు. విమానాశ్రయంలోనే తండ్రీకూతుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి పాస్ పోర్ట్‌లు సీజ్ చేశారు.

 1. 2016 ఏప్రిల్ 4 : పనామా పేపర్స్ లీక్ ‌లో నవాజ్ షరీఫ్ కుటుంబ సభ్యుల పేర్లు బయటపడ్డాయి. లండన్‌లోని అవెన్ ఫీల్డ్‌లో అపార్ట్‌మెంట్లు

  ఉన్నాయని వెల్లడైంది.

 2. 2016 ఏప్రిల్ 5 : తనపై వచ్చిన ఆరోపణలను విచారించేందుకు షరీఫ్ జ్యుడీషియల్ కమిటీని నియమించారు.

 3. 2016 నవంబర్ 1 : షరీఫ్ ఆస్తులకు సంబంధించిన కేసును విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. 4. 2016 నవంబర్ 7 : ఖతారీ ప్రిన్స్ రాసిన లేఖలను నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్) కోర్టుకు సమర్పించింది. (నవాజ్ షరీఫ్ తండ్రి మెయిన్ మొహమ్మద్ షరీఫ్.. తమ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని, అందులో వచ్చిన లాభాల ద్వారా లండన్‌లో ఆయన మనవళ్ల కోసం అపార్ట్‌మెంట్లు కొన్నారంటూ ఖతారీ ప్రిన్స్ అల్ తానీ ఆ లేఖలో పేర్కొన్నారు.)
 5. 2017 జనవరి 6 : తమకు ఎంత ఆస్తులు ఉన్నాయో తెలియజేస్తూ షరీఫ్ కుమార్తె మార్యం కోర్టుకు అఫిడవిట్ ఇచ్చారు.

 6. 2017 ఏప్రిల్ 20 : నవాజ్ షరీఫ్ అక్రమాస్తులపై విచారణకు సుప్రీంకోర్టు జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను నియమించాలని ఆదేశించింది.

 7. 2017 జూన్ 15 : జేఐటీ విచారణకు నవాజ్ షరీఫ్ హాజరయ్యారు. (ఓ విచారణ కమిటీ ముందు హాజరైన తొలి పాకిస్థాన్ ప్రధానిగా ఆయన అపఖ్యాతి మూటగట్టుకున్నారు)

 8. 2017 జూలై 10 : జేఐటీ తమ తుది నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది.

 9. 2017 జూలై 28 : నవాజ్ షరీఫ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకాభిప్రాయానికి వచ్చింది. వెంటనే పీఎం పదవి నుంచి దిగిపోవాలని షరీఫ్‌ను ఆదేశించింది.

 10. 2017 ఆగస్ట్ 15 : తీర్పును పున:సమీక్షించాలని కోరుతూ నవాజ్ షరీఫ్ మూడు పిటిషన్లను దాఖలు చేశారు.

 11. 2017 సెప్టెంబర్ 15 : షరీఫ్ పెట్టుకున్న రెండు రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

 12. 2017 సెప్టెంబర్ 27 : నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబసభ్యుల ఆస్తులు, బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు.

 13. 2017 సెప్టెంబర్ 26 : పనామా పేపర్స్ లీక్ కేసుకు సంబంధించి నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో కోర్టు ఎదుట నవాజ్ షరీఫ్ మొదటిసారి హాజరయ్యారు.

 14. 2018 ఫిబ్రవరి 21 : పాకిస్థాన్ ముస్లిం లీగ్ అధ్యక్షుడిగా నవాజ్ షరీఫ్ ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

 15. 2018 ఏప్రిల్ 13 : షరీఫ్ జీవితకాలంపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడంటూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది.

 16. 2018 జూలై 6 : నవాజ్ షరీఫ్ కు పదేళ్లు, ఆయన కుమార్తెకు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ నేషలన్ అకౌంటబిలిటీ కోర్టు తీర్పు చెప్పింది.

 17. 2018 జూలై 12: లండన్ నుంచి షరీఫ్, కుమార్తె మార్యం షరీఫ్ పాకిస్థాన్ బయలుదేరారు.

 18. 2018 జూలై 13 : లాహోర్ విమానాశ్రయంలో దిగిన వెంటనే నవాజ్ షరీఫ్, మార్యం షరీఫ్‌ను అరెస్ట్ చేశారు.

First published: July 14, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>