Home /News /politics /

TOP 10 LANDMARK SUPREME COURT VERDICTS OF 2018

#FlashBack2018: టాప్ 10 సుప్రీంకోర్టు ప్రతిష్టాత్మక తీర్పులివే...

సుప్రీంకోర్టు (ఫైల్)

సుప్రీంకోర్టు (ఫైల్)

    2018లో సుప్రీంకోర్టు అనేక సంచలనాత్మక తీర్పుల్ని ఇస్తుంది. శబరిమల దేవాలయంలో మహిళలకు ప్రవేశం నుంచి... స్వలింగ సంపర్కం నేరం కాదంటూ చరిత్రాత్మక తీర్పులను ప్రకటిస్తూ వచ్చింది. ఒకసారి గతేడాది అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన జడ్జీమెంట్లను పరిశీలిస్తే.... ఎన్నో సంచలనాత్మక కేసులతో పాటు.. సున్నితమైన అంశాలపై కూడా న్యాయస్థానం తీర్పులను వెలువరించింది.

    స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సెప్టెంబర్ 7, 2018న సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది.పరస్పర ఆమోదంతో స్వలింగ సంపర్కం చేస్తే తప్పేంటని ప్రశ్నించింది. ఇది ఇద్దరు పెద్దల వ్యక్గిగతమని... దీని వల్ల ఇతరులకుఎలాంటి హాని లేదని వ్యాఖ్యానించింది. ఎల్జీబీటీలకు సమాన హక్కలుు ఉన్నాయని.. హుందాగా బతికే హక్కు కూడా వారికి ఉందని న్యాయస్థానం పేర్కొంది. వారి శృంగార ధోరణిని కాదనలేమని కోర్టు స్పష్టం చేసింది.

    స్వలింగ సంపర్కం నేరం కాదన్న న్యాయస్థానం


    2018 సెప్టెంబర్ 25న మరో కీలక తీర్పునిచ్చింది సుప్రీం. ఎన్నికల్లో నేరస్థుల పోటీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. క్రిమినల్ నేరారోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేయవచ్చని స్పష్టం చేసింది. ప్రస్తుత ప్రజా ప్రతినిథ్యం చట్టం ప్రకారం ఎంపీలు, ఎమ్మెల్యేలపై హత్యా, అత్యాచారం, కిడ్నాప్ వంటి క్రిమినల్ కేసులు ఉన్నా వాటిలో దోషులుగా తేలితేనే అనర్హులుగా పరిగణిస్తున్నారు. ఇలాంటి వారిపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్‌ను తోసిపుచ్చింది.

    సుప్రీంకోర్టు


    సెప్టెంబర్ 27న మరో సంచలనాత్మక తీర్పునిచ్చింది న్యాయస్థానం. వివాహేతర సంబంధం నేరం కోర్టు స్పష్టం చేసింది. స్త్రీ పురుషులిద్దరు ఇష్టపూర్వక శ‌ృంగారాన్ని నేరంగా పరిగణించడం రాజ్యంగ విరుద్ధమంటూ పేర్కొంది. పురుషుడితో సమానంగా మహిళకు హక్కు ఉండాలని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తేల్చిచెప్పింది. సెక్షన్ 497 ప్రకారం ఇకపై ఇలాంటి కేసును క్రిమినల్ నేరంగా పరిగణించరాదని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేత‌ృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది.

    వివాహేతర సంబంధం నేరం కాదన్న సుప్రీంకోర్టు


    సుప్రీంకోర్టు  కారుణ్య మరణాలపై సంచలనాత్మక తీర్పును వెలువరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కారుణ్య నియామకాలపై తీర్పును వెలువరించింది. ‘గౌరవంగా మరణించే హక్కు మనుషులకు ఉంటుంది' అని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే కారుణ్య మరణానికి అనుమతినించాలని పేర్కొంటూ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.

    కారుణ్య మరణాలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్


    దీంతో పాటు రాజ్యంగా జాతీయ ప్రయోజనాలున్న కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతులు ఇచ్చింది. కోర్టుల్లో జడ్జీలు విచారిస్తున్న కేసుల్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలన్న కేసకు సంబంధించి సీజేఐ మిశ్రా నేత‌ృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే వివాహ వివాదాలు,లైంగిక దాడులు వంటి సున్నితమైన కేసుల్ని ఎప్పటికీ ప్రత్యక్ష ప్రసారం చేయకూడదని స్పష్టం చేసింది న్యాయస్థానం.

    సుప్రీంకోర్టు


    అంతకుముందు ఆధార్ రాజ్యాంగబద్ధమైనదేనని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఐతే ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు ఆధార్ వివరాలు కోరడానికి వీల్లేదని స్పష్టంచేసింది. టెలికాం కంపెనీలు, బ్యాంకులు, విద్యాసంస్థలు, పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలకు ఆధార్ కార్డు అవసరం లేదని తెలిపింది. పాన్‌, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్నులకు మాత్రం ఆధార్‌ తప్పనిసరని స్పష్టంచేసింది. ఈ క్రమంలో ఆధార్ తీర్పును దేశంలోని అన్ని ప్రధాన పార్టీలు స్వాగతించాయి.

    ఆధార్


    ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి రిజర్వేషన్లు అవసరం లేదని గతంలో ఇచ్చిన తీర్పును మరోసారి సమీక్షించేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ను ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కూడా బదిలీ చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ కేసుకు సంబంధించి 2006లో నాగరాజు పిటిషన్‌పై ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్ధించింది. పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల కోసం రాష్ట్రాలు ఎటువంటి సమాచారం సేకరించాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేసింది.

    సుప్రీంకోర్టు(File)
    సుప్రీం కోర్టు(File)


    బీమా కోరేగావ్ అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. అరెస్టు చేసిన ఐదుగురు హక్కుల కార్యకర్తల విషయంలో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారి అరెస్టపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నియామకానికి కూడా తిరస్కరించింది. హక్కుల కార్యకర్తలను తక్షణమే విడుదల చేసేందుకు కూడా కోర్టు నిరాకరించింది.

    భీమా కోరెగావ్ అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు తీర్పు


    మరోవైపు అయోధ్య రామమందిరం కేసు విషయంలో కూడా అత్యున్నత న్యాయస్థానం చారిత్రక తీర్పును వెలువరించింది. 1994 నాటి ఇస్మాయిల్ ఫారుఖీ కేసును విస్తృత ధర్మాసనానికి ఇచ్చేందుకు నిరాకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం 2:1 మెజార్టీతో తీర్పునిచ్చింది. ఇస్లాం ప్రకారం ప్రార్థనలు చేసేందుకు మసీదు తప్పనిసరికాదని 1994 నాటి తీర్పుపై పున: విచారణ జరగదని స్పష్టం చేసింది.

    అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి స్థలంలో నమాజ్‌కు అనుమతివ్వని అలహాబాద్ హైకోర్టు


    వీటితోపాటు.. డిసెంబర్ 14న  రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంపై కూడా సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది.రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది. రాఫెల్ యుద్ధ విమానాల ధరలపై విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

    రాఫెల్ ఒప్పందంపై సుప్రీం తీర్పు
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: National, National News, Supreme Court, Yearender 2018

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు