AP MPTC, ZPTC Election Results: నేడే పరిషత్ ఎన్నికల కౌంటింగ్.. విజయోత్సవాలపై ఆంక్షలు

ప్రతీకాత్మకచిత్రం

Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్‌ ఎన్నికల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఏపీలో రాజకీయల అలజడి పెరగడంతో కౌంటింగ్ కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం.

  • Share this:
    AP Parishad Election Couting :ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పరిషత్ ఎన్నికల కౌంటింగ్ (Parishath Elections Counting)కు సర్వం సిద్ధమైంది. జెడ్పీటీసీ(ZPTC), ఎంపీటీసీ (MPTC) ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభంకానుంది. ఇదే రోజు ఫలితాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (State Election Commssion) వెల్లడించ నుంది.  కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ నిర్వహించేలా చూడాలని అధికారులకు ఎస్ఈసీ నీలం సాహ్నీ(SEC Neelam Sawhney) సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ (CS Adithyanath Das) ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు,డిపిఓలు, జడ్పి సిఇఓలు, ఇతర ఉన్నతాధికారుల నుంచి ఎన్నికల ఏర్పాటుకు సంబంధించి సమాచారం ఇప్పటికే తెప్పించుకున్నారు. వివిధ పార్టీల ఏజెంట్ల జాబితా ఉన్నతాధికారులకు చేరింది.

    గెలిచిన అభ్యర్థులు విజయోత్సవాలు జరుపవద్దని ఎస్‌ఈసీ పార్టీలకు సూచించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం వియోజత్సవ ర్యాలీలు నిర్వహించవద్దని తెలిపింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, జడ్పీ సీఈఓలు, డీపీఓలతో ఎస్‌ఈసీ, సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రాలను దగ్గర భద్రతను పటిష్టం చేయాలని ఆదేశించారు.

    ఇదీ చదవండి: చంద్రబాబు, అయ్యన్నలపై రోజా సంచలన వ్యాఖ్యలు.. టీటీడీ చైర్మన్ తో భేటీకి కారణం ఇదే..

    ఏపీలో మొత్తం 10 వేల 47 ఎంపీటీసీ స్థానాలు, 660 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. పలు కారణాలతో నోటిఫికేషన్ జారీ చేసే సమయంలో 375 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. 2020 మార్చి 7న మొత్తం 9 వేల 672 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయింది. వీటిలో 2 వేల 371 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే సుదీర్ఘ ప్రక్రియలో అభ్యర్థులు మృతి చెందిన చోట 81 స్థానాల్లో పోలింగ్ నిలిపివేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 8 న 7 వేల 220 స్థానాల్లో పోలింగ్ జరిగింది.

    ఇదీ చదవండి: ఆన్‌లైన్‌ సినిమా టికెట్ల అమ్మకంపై సోమవారం క్లారిటీ.. సీఎంతో భేటీకి పెద్దలు డుమ్మా..!

    మొత్తం 18 వేల 782 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఏపీలో మొత్తం 660 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. 2020 మార్చి 7న 652 స్థానాలకు నోటిఫికేషన్ జారీ అయింది. నోటిఫికేషన్ జారీ సమయంలో 8 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. అభ్యర్థులు మృతి చెందడంతో 11 చోట్ల పోలింగ్ ఆగిపోయింది. 126 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 8న 515 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. 2 వేల 58 మంది అభ్యర్థులు తమ లక్కును పరీక్షించుకుంటున్నారు.

    ఇదీ చదవండి: ఏపీలో కర్ఫ్యూ మళ్లీ పొడిగింపు.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. పెళ్లిళ్లు.. పండుగలపై నిఘా

    రాష్ట్ర వ్యాప్తంగా 275 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కౌంటింగ్ లో 41 వేల మంది సిబ్బంది పాల్గొననున్నారు. అయితే మొదట 10వ తేదీన ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉండేది. కానీ  ఎన్నికల ప్రక్రియ సరిగా లేదంటూ జనసేన, టీడీపీలు హైకోర్టులో పిటిషన్ వేశాయి. జనసేన పిటిషన్ ను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం.. ఎన్నికలను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. దీనిని ఎస్ఈసీతో పాటు పోటీ చేసిన అభ్యర్థులు కొందరు డివిజన్ బెంచ్ లో సవాల్ చేశారు. దీనిపై ఆగస్టు 5వ తేదీన విచారణ ముగిసిన కోర్టు.. సెప్టెంబర్ 16న సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేస్తూ కౌంటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
    Published by:Nagesh Paina
    First published: