• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TOMORROW ANDHRA PRADESH CABINET MEETING WILL TAKE DECISION ON STRICT CURFEW IN OVERALL STATE NGS

Andhra Pradesh: మే 5 నుంచి పగటి పూట కర్ఫ్యూ. పరిస్థితిని బట్టి లాక్ డౌన్ పై నిర్ణయం.. కేబినెట్ బేటీలో చర్చ!

Andhra Pradesh: మే 5 నుంచి పగటి పూట కర్ఫ్యూ. పరిస్థితిని బట్టి లాక్ డౌన్ పై నిర్ణయం.. కేబినెట్ బేటీలో చర్చ!

రేపు ఏపీ కేబినెట్ భేటీ

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలి.. కఠిన కర్ఫ్యూ అమలు చేస్తే సరిపోతుందా? ఇంకేమైనా ఆంక్షలు విధించాలా? లాక్ డౌనే సరైన ఆయుధమా.. వీటన్నటిపైనా మంగళవారం ఏపీ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది.

  • Share this:
    ఏపీలో కరోనా మహమ్మారి రెచ్చిపోతోంది. రోజు రోజుకూ రాష్ట్రంపై సునామీలా విరుచుకుపడుతోంది. ఊహించని స్థాయిలో కరోనా కాటేస్తోంది. గత వారం రోజులుగా క్రమం తప్పకుండా 20 వేలకు అటు ఇటుగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇటు మరణాల సంఖ్య ప్రతి రోజు 50 మార్కును క్రాస్ చేస్తున్నాయి. దీంతో పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఏపీలో న్యూ వేరియంట్ కారణంగానే కేసులు రెట్టింపు అవుతున్నాయని హెచ్చరికలు నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి అలర్ట్ అయ్యింది. అందుకే మే ఐదవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాక్షిక కర్ఫ్యూ పెడుతున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. అంటే మధ్యాహ్నం 12 గంటల వరకే షాపులు తెరుచుకునేందుకు అవకాశం ఇస్తారు. అత్యవసరం అయితే తప్పా ఎవరూ బయటకు రావొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇంకా ఎలాంటి ఆంక్షలు విధించాలి? లాక్ డౌన్ తప్పదా? ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అనే దానిపై కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

    గత కొన్ని రోజుల నుంచి వేర్వేరు కారణాలతో ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఏపీ రాష్ట్ర కేబినెట్ సమావేశం మంగళవారం జరగనుంది. సీఎం జగన్‌ అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్‌లో మంత్రులు సమావేశం కానున్నారు. ముఖ్యంగా బుధవారం నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూ విధింపును కేబినెట్‌ మొదట ఆమోదం తెలపనుంది. కర్ఫ్యూ ఫలితం ఎలా ఉంటుంది అన్నది అంచనా వేసిన తరువాత లాక్ డౌన్ పెట్టాలా లేదా అన్నదానిపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకుంటే ఇప్పటికే కేంద్రం దీనిపై స్పష్టత ఇచ్చేసింది. లాక్ డౌన్ పెట్టాలా వద్దా అనేది ఆయ రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో కేంద్రం స్పష్టం చేసింది. మరి ఏపీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

    రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు, వైరస్‌ కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్‌పై మంత్రివర్గంలో చర్చించనున్నారు.వీటితో పాటు గతంలో పెండింగ్‌లో ఉన్న వివిధ అంశాలూ చర్చకు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా క‌రోనా వికృతరూపం ప్రదర్శిస్తోంది. ప్రతి రోజూ 20 వేలకు అటు ఇటుగా కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో పాటు మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ స‌మావేశం అవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 4వ తేదీన ఉద‌యం రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అధ్యక్షత‌న జ‌ర‌గ‌నున్న ఏపీ కేబినెట్ స‌మావేశంలో.. క‌రోనా నియంత్రణకు చేపట్టాల్సిన చర్చలపైనే ప్రధానంగా చ‌ర్చించి కీల‌క నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

    అలాగే, రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ల కొర‌త వెంటాడుతుండ‌గా.. వ్యాక్సినేష‌న్‌ను వేగ‌వంతం చేయ‌డంపై కూడా దృష్టిసారించ‌నుంది రాష్ట్ర ప్రభుత్వం. రికార్డు స్థాయిలో పెరుగుతున్న క‌రోనా రోగుల‌కు అందుతున్న వైద్య స‌దుపాయాల‌పై చ‌ర్చించ‌నున్న సీఎం వైఎస్ జ‌గ‌న్.. ఆక్సిజ‌న్, బెడ్లు, రెమిడెసివిర్ కొర‌త వంటి అంశాల‌పై చ‌ర్చించే అవ‌కాశాలున్నాయి. వీటితో పాటు గతంలో పెండింగ్‌లో ఉన్న వివిధ అంశాలూ చర్చకు రానున్నాయి.
    Published by:Nagesh Paina
    First published: