సీఎం జగన్‌కు హీరో ప్రభాస్ ప్రశంసలు

ఏపీ సీఎం వైఎస్ జగన్ గురించి టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

news18-telugu
Updated: August 17, 2019, 4:20 PM IST
సీఎం జగన్‌కు హీరో ప్రభాస్ ప్రశంసలు
వైఎస్ జగన్, ప్రభాస్
  • Share this:
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం కావడం టాలీవుడ్ పెద్దలకు ఏ మాత్రం ఇష్టంలేదని సినీనటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ తరచూ వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై టాలీవుడ్ నుంచి రాజేంద్రప్రసాద్ స్పందించడంతో సరికొత్త వివాదం మొదలైంది. ఈ వివాదం సంగతి ఎలా ఉన్నా... తాజా ఏపీ సీఎం వైఎస్ జగన్ గురించి టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్పందించారు. సాహో సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ప్రభాస్... తమిళంలోని పలు టీవీ ఛానళ్లకు, వెబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సందర్భంగా తనకు నచ్చిన ప్రముఖులతో పాటు ఏపీ సీఎం జగన్‌పై స్పందించారు ప్రభాస్. తనకు రాజకీయాలు అంతగా తెలియవని వ్యాఖ్యానించిన ప్రభాస్... ఏపీకి యంగ్ సీఎంగా ఉన్న జగన్ బాగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. ఆయన హయాంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నట్టు ప్రభాస్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సాహో సినిమా విశేషాలతో పాటు అనేక అంశాలపై ప్రభాస్ మాట్లాడారు.

First published: August 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు