బీజేపీలోకి మెగాస్టార్ చిరంజీవి..? కీలక నేతలతో త్వరలో సమావేశం..

Megastar Chiranjeevi: ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి కాషాయ కండువా కప్పుకోబోతున్నారా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 25, 2019, 11:46 AM IST
బీజేపీలోకి మెగాస్టార్ చిరంజీవి..? కీలక నేతలతో త్వరలో సమావేశం..
చిరంజీవి (ఫైల్ ఫోటో)
  • Share this:
తెలుగు రాష్ట్రాల్లో ‘ఆపరేషన్ కమలం’తో కీలక నేతలకు కాషాయ కండువా కప్పుతూ పార్టీని బలోపేతం చేస్తోంది.. బీజేపీ. ఏపీలో టీడీపీ కేడర్‌పై గురి పెట్టి కీలక నేతలకు గాలం వేస్తోంది. అన్ని సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతుంది. అందులో భాగంగానే నలుగురు టీడీపీ ఎంపీలు ఇటీవల బీజేపీ కండువా కప్పుకున్నారు. వారిలో సీఎం రమేష్, గరికపాటి మోహన్‌రావు, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ ఉన్నారు. మరికొంత మంది ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ పార్టీ మారడానికి సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే రాయలసీమకు చెందిన పెద్ద కుటుంబాలను పార్టీ మార్చటానికి తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. ఆయా కుటుంబాలతో బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఏపీ రాజకీయాల్లో కీలక వ్యక్తిని పార్టీలోకి తీసుకువచ్చేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి కాషాయ కండువా కప్పుకోబోతున్నారా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. అందుకు బీజేపీ కాపు సామాజిక వర్గ నేతలతో భేటీయే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా.. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఆ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించలేదు. గత ఏడాది ఏప్రిల్‌లో చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం ముగిసింది.

ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 74 నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న నేపథ్యంలో చిరంజీవిని పార్టీలోకి తీసుకుని, అవసరమైతే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని కూడా అప్పజెప్పాలని కాషాయ పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్, కన్నా లక్ష్మీనారాయణ సహా కొందరు చిరంజీవితో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. నిజంగానే మెగాస్టార్ బీజేపీలో చేరితే ఆ పార్టీకి ఆయన స్టార్‌డమ్ కచ్చితంగా కలిసి వస్తుంది. ఇక గత కొంత కాలంగా సినిమాల మీద దృష్టి సారించిన ఆయన ప్రస్తుతం సైరా న‌ర‌సింహారెడ్డి చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: June 25, 2019, 11:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading