• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • TOLLYWOOD HERO MANCHU VISHNU SENSATIONAL COMMENTS ON VIZAG STEEL PLANT PROTEST NGS

Vizag Steel Plant: సినిమా వాళ్లు సపోర్ట్ చేయకపోవడానికి ఇదే కారణం. విశాఖ స్టీల్ ప్లాంట్ పై మంచు విష్ణు

విశాఖ ఉక్కుపై మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ హీరోలు కేంద్రంలోని బీజేపీ నేతలను చూసి భయపడుతున్నారా? అందుకే విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపలేకపోతున్నారా? మంచు విష్ణు వ్యాఖ్యల అర్థం అదేనా?

  • Share this:
    విశాఖ ఉక్కు ఉద్యమం తీవ్ర ఉద్ధృతమైంది. ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చిన కార్మిక సంఘాలు.. ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాయి. ఈ నెల 15 నుంచి రోజుకో రూపంలో నిరసన తెలియజేయాలని ఉక్కు పరిరక్షణ సమితి నిర్ణయించింది. అవసరమైతే రాజకీయ, సినిమా ప్రముఖులను అడ్డుకునేందుకు కూడా సిద్ధమవుతున్నారు. తెలంగాణ రాజకీయ నేతల నుంచి మద్దతు లభిస్తున్నా..? ఏపీ రాజకీయ పార్టీల నుంచి కానీ.. టాలీవుడ్ నుంచి కాని సరైన మద్దతు రాకపోవడంతో కార్మిక సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి.

    రాజకీయ పార్టీలు అన్ని కలిసి పోరాటం చేయకపోయినా.. ఏ పార్టీకి ఆ పార్టీ విశాఖ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నాయి. అన్ని పార్టీల నేతలు వచ్చి ఆందోళనల్లో భాగమవుతున్నారు. కానీ టాలీవుడ్ నుంచి ఇప్పటి వరకు ఒక్కరు కూడా నేరుగా విశాఖ వచ్చి విశాఖ ఉద్యమంపై మాట్లాడింది లేదు. అప్పుడెప్పుడో నారా రోహిత్ ట్వీట్ తో సరిపెట్టుకుంటే.. తాజాగా చిరంజీవి ఆవేశంతో కూడిన ట్వీట్ చేసి చేతులు దులుపుకున్నారు.

    ఆంధ్ర ప్రదేశ్ కు ఇంత అన్యాయం జరుగుతోంది. విశాఖ ప్రజలు గొంతు పగిలేలా నినదిస్తున్నారు. అయితే మన తెలుగు సినీ పరిశ్రమకు వినిపించడం లేదు.. కనిపించడం లేదు. దీంతో టాలీవుడ్ తీరుపై కార్మిక సంఘాలు గుర్రుగా ఉన్నాయి. ప్రమోషనల్ ఈవెంట్ల కోసం విశాఖ వచ్చే సినిమా పెద్దలంతా విశాఖపై తమకు ఇంత ప్రేమ, అంత ప్రేమ ఉంది అంటారు కానీ.. ఇప్పుడు విశాఖకు ఇంత కష్టమొస్తే ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు.

    దీంతో ఇకపై సినిమా నుంచి ఎవరు విశాఖ వచ్చినా కచ్చితంగా అడ్డుకుంటామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఇందులో భాగంగా టాలీవుడ్ హీరోమంచు విష్ణుకు విశాఖ ఉక్కు నిరసన సెగ తగిలింది. సినిమా ప్రమోషన్‌ కోసం విశాఖ వచ్చిన మంచు విష్ణును.. స్టీల్ ప్లాంట్ నిరసనకారులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమానికి మంచు విష్ణు మద్దతు ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు నిరసనకారులు.

    ఇదీ చదవండి: విశాఖ ఉక్కు ఉద్యమంలో టాలీవుడ్ ఎక్కడ? ఒక్క ట్వీట్ తో సరా?

    స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమానికి టాలీవుడ్‌ మద్దతు ఇవ్వాలని.. సినీ ప్రముఖులు ఎవరు వచ్చినా అడ్డుకుంటామని కార్మికులు హెచ్చరించారు. అయితే.. దీనిపై మంచు విష్ణు స్పందించారు. ప్రైవేట్‌ వ్యక్తులు లాభాల్లో నిర్వహిస్తామన్నప్పుడు, ప్రభుత్వానికి ఎందుకు సాధ్యం కాదని ఆయన ప్రశ్నించారు. విశాఖ ఉద్యమానికి మద్దతు తెలపాలని సినీ ప్రముఖులకు ఉందని.. అయితే రాజకీయ కారణాల వల్లే వారంతా ముందుకు రాలేకపోతున్నారని మంచు విష్ణు అభిప్రాయపడ్డారు. ఇకపై సినీ పెద్దల నిర్ణయం ప్రకారం ముందుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు.

    అంటే మంచు విష్ణు మాటలను బట్టి చూస్తే.. సినిమా పెద్దలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి భయపడుతున్నారా? లేక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు కోసం ఎదురు చూస్తున్నారన్నా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. అయితే గతంలో దీనిపై చాలా వరకు విమర్శలు వచ్చాయి. బీజేపీ పెద్దలను ఎదిరించి తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకనే భయంతోనే సినిమా పెద్దలు ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపలేపోయారని రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు.. ఇప్పుడు మంచు విష్ణు వ్యాఖ్యలతో అది నిజమని తేలిపోయింది.
    Published by:Nagesh Paina
    First published: