టాలీవుడ్ సినీ ప్రముఖులకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఇష్టంలేదని సినీనటుడు, ఆ పార్టీ నేత పృథ్వీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖులెవరూ ఇప్పటివరకు సీఎం జగన్‌ను కలవకపోవడమే ఇందుకు కారణమని వేరే చెప్పనవసరం లేదు. అయితే థర్టీ ఇయర్స్ పృథ్వీ వ్యాఖ్యలను మరో సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి తీవ్రంగా తప్పుబట్టారు. పృథ్వీకి సరైన సమాచారం లేకపోవడం వల్ల అలా మాట్లాడి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. తాజాగా మరో సినీనటుడు రాజేంద్రప్రసాద్ ఈ విషయంలో ఇంకో అడుగు ముందుకేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొత్తగా ముఖ్యమంత్రి అయిన వారిని కళాకారులు కచ్చితంగా కలవాలనే రూల్ ఏమీ లేదని కామెంట్ చేశారు.
అటు పోసాని, ఇటు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. థర్టీ ఇయర్స్ పృథ్వీ ఈ విషయంలో అనవసరంగా టాలీవుడ్ స్టార్స్‌ను తప్పుబట్టాడా అనే టాక్ కూడా వినిపిస్తోంది. వైసీపీతో సన్నిహితంగా ఉండే టాలీవుడ్ స్టార్స్ ఎవరూ ఈ విషయాన్ని ప్రస్తావించనప్పుడు... ఒక్క పృథ్వీ మాత్రమే ఈ అంశంపై స్పందించడం ఎందుకనే చర్చ కూడా మొదలైందని తెలుస్తోంది. మరోవైపు పృథ్వీ వ్యాఖ్యలపై సైలెంట్‌గా ఉంటే బాగుండదనే ఉద్దేశ్యంతోనే... సినీ ప్రముఖులు ఈ అంశంపై స్పందిస్తారని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి వైసీపీ నేత పృథ్వీకి కౌంటర్ ఇచ్చే విషయంలో టాలీవుడ్‌లో ఏదో జరుగుతోందనే ప్రచారం సాగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 30 Years Prudhvi Raj, Ap cm ys jagan mohan reddy, Posani Krishna Murali, Rajendra Prasad, Tollywood