Home /News /politics /

TOLLYWOOD ACTOR MOHAN BABU HOUSE ARREST IN TIRUPATI SB

తిరుపతిలో మోహన్ బాబు హౌస్ అరెస్ట్

తిరుపతిలో మోహన్ బాబు

తిరుపతిలో మోహన్ బాబు

తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థుల ఫీజుల తిరిగి చెల్లింపు విషయంలో ఆంధ్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నందుకు నిరసనగా మోహన్ బాబు ధర్నా చేపడతానన్నారు.

    శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత, సినీ నటుడు మోహన్ బాబు నిరసనను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తిరుపతిలో మోహన్ బాబును హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఉదయం 7 గంటలకు భారీగా విద్యానికేతన్‌కు చేరుకున్నారు. అయితే మోహన్ బాబు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను నిరసనను కొనసాగిస్తామని చెబుతున్నారు. దీంతో తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థుల ఫీజుల తిరిగి చెల్లింపు విషయంలో ఆంధ్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నందుకు నిరసనగా మోహన్ బాబు ధర్నా చేపడతానన్నారు. ఇప్పటికే ఆ మధ్య ఈ విషయంలో ఆయన పలుమార్లు విమర్శలు చేశారు. మోహన్ బాబు కుమారుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధిపతి అయిన విష్ణు కూడా బాహాటంగా విమర్శలు చేశారు.

    మోహన్ బాబు ఈసారి ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేస్తారని వార్తలు వినిపించాయి. కానీ చేయడం లేదు. ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేస్తారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు ధర్నా ఎందుకోసం చేసినా, అది ఎన్నికల ప్రచారం మాదిరిగా ఓటర్ల ఆలోచన మీద ప్రభావం చూపించే అవకాశం మాత్రం వుంది. దీంతో మోహన్ బాబు చేపడుతున్న ధర్నాకు అడ్డుకట్ట వేసేందుకు చంద్రబాబు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పోలీసుల్ని పంపి.. ఆయనను హౌస్ అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

    First published:

    Tags: Andhra Pradesh, Chandrababu naidu, Mohan Babu, Tirupati, Tollywood news

    తదుపరి వార్తలు