‘చంద్రబాబు మాట నిలబెట్టుకోలేదు’... మోహన్ బాబు విమర్శలు

2014-15 నుంచి విద్యానికేతన్ విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదని సినీనటుడు మోహన్ బాబు వ్యాఖ్యానించారు. ఈ అంశంలో ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన రాలేదని తెలిపారు.

news18-telugu
Updated: March 2, 2019, 12:21 PM IST
‘చంద్రబాబు మాట నిలబెట్టుకోలేదు’... మోహన్ బాబు విమర్శలు
సినీ నటుడు మోహన్ బాబు(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: March 2, 2019, 12:21 PM IST
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై సినీనటుడు మోహన్ బాబు విమర్శలు గుప్పించారు. 2014-15 నుంచి విద్యానికేతన్ విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. ఈ అంశంలో ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన రాలేదని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇంటింటికి తిరిగి అమలుకాని హామీలు ఎందుకు ఇస్తున్నారని మోహన్ బాబు ప్రశ్నించారు. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని స్పష్టం చేసిన మోహన్ బాబు... ఏ పార్టీ ప్రోత్సాహంతోనో తాను మాట్లాడటం లేదని వివరించారు.

చంద్రబాబు కూడా తనకు ఎంతో సన్నిహితుడని చెప్పిన మోహన్ బాబు... ఆయన విధానాలపైనే తాను మాట్లాడుతున్నానని అన్నారు. విద్యాభివృద్ధిపై ఏపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మోహన్ బాబు విమర్శలు గుప్పించారు. విద్యానికేతన్ విద్యాసంస్థలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై గతంలోనూ ప్రస్తావించిన మోహన్ బాబు... ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.


First published: March 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...