TOLLYWOOD ACTOR BANDLA GANESH COUNTER TO TELANGANA MLC KAVITHA SK
Bandla Ganesh-Kavitha: కవితకు బండ్ల గణేష్ కౌంటర్.. నేను జోకర్ని కాదు..
బండ్ల గణేష్, కవిత
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే బండ్ల గణేష్ పేరును ఆమె తెరమీదకు తెచ్చారు.
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల గణేష్ పేరు మార్మోగిపోయిన విషయం తెలిసిందే. అప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న ఆయన.. తమ పార్టీ గెలవకుంటే గొంతుకోసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో.. ఆయనపై బీభత్సమైన ట్రోల్ జరిగింది. ఐతే తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బండ్ల గణేష్ పేరు మరోసారి ట్రెండ్ అవుతోంది. ఎమ్మెల్సీ కవిత ఆయన్ను గుర్తు చేయడంతో ఈసారి కాస్త ఆలస్యంగా వినిపిస్తోంది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే బండ్ల గణేష్ పేరును ఆమె తెరమీదకు తెచ్చారు.
''గ్రేటర్ ఎన్నికల సమయంలో కొత్త జోకర్ వచ్చాడు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బండ్ల గణేష్ కామెడీ చేశాడు. ఈసారి ఫన్ మిస్సవుతుందే అనుకున్న సమయంలో బండి సంజయ్ వచ్చాడు. అప్పుడు బండ్ల గణేష్ చేసినట్లుగానే ఈయన కామెడీ షో చేస్తున్నాడు. హైదరాబాద్ పేరు మారిస్తే ఏం లాభం? పేరు కాదు. పరిపాలనా విధానాలను మార్చుకోవాలి. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ మరోసారి ఘనవిజయం సాధిస్తుంది.'' అని ఆమె అన్నారు.
కవిత వ్యాఖ్యలపై స్పందించిన బండ్ల గణేష్.. ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ''కవిత గారూ.. నేను జోకర్ని కాదు. ఫైటర్ని.ఏదేమైనా నేను ఎలాంటి రాజకీయాల్లోనూ ఉండదలచుకోలేదు.'' అని ట్వీట్ చేశారు బండ్ల గణేష్.
@RaoKavitha garu I am not a joker , I’m a fighter but I don’t want to be in any politics right now . All the best 🙏
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి, ట్రోలింగ్ తర్వాత... తాను ఏ పార్టీలో లేనని బండ్ల గణేష్ పదే పదే చెప్పారు. ఇకపై సినిమాలు, వ్యాపారాలే చూసుకుంటానని క్లారిటీ ఇచ్చారు. కాగా, గతంలో ఎన్నో సినిమాల్లో కమెడియన్‌గా నటించిన ఆయన.. పలు హిట్ చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించాడు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చారు. రానున్న రోజుల్లో మళ్లీ సినిమాలు నిర్మించేందుకు సిద్ధమవున్నారు.