ఇటు చిరంజీవి... అటు జగన్... వైసీపీ నేత కొత్త ప్లాన్

నిన్నమొన్నటి వరకు టాలీవుడ్‌పై విమర్శలు గుప్పించిన నటుడు పృథ్వీ... ఇప్పుడు సడన్‌గా రూటు మార్చారు.

news18-telugu
Updated: September 23, 2019, 6:20 PM IST
ఇటు చిరంజీవి... అటు జగన్... వైసీపీ నేత కొత్త ప్లాన్
మెగాస్టార్ చిరంజీవి, సీఎం జగన్(ఫైల్ ఫోటోలు)
  • Share this:
కొంతకాలం క్రితం వరకు సీఎం జగన్‌ను అభినందించేందుకు సినీ పెద్దలెవరూ ముందుకు రావడం లేదని... అసలు టాలీవుడ్ పెద్దలకు జగన్ సీఎం కావడం ఇష్టంలేదని సరికొత్త సంచలనానికి తెరలేపారు నటుడు థర్టీ ఇయర్స్ పృథ్వీ. ఒక్కసారిగా కాదు... రెండు మూడు సార్లు ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. పృథ్వీ కామెంట్స్‌కు టాలీవుడ్‌లోని రాజేంద్రప్రసాద్‌తో పాటు వైసీపీ నేతగా ఉన్న నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి కౌంటర్ ఇచ్చారు. తన వ్యాఖ్యల కారణంగా పృథ్వీకి టాలీవుడ్‌లో అవకాశాలు కూడా తగ్గిపోయాయని... మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోలు నటించే సినిమాల్లో ఆయనకు అవకాశాలు రావడం లేదనే ఊహాగానాలు వినిపించాయి.

మెగా ఫ్యామిలీతో పాటు ఇతర స్టార్స్ నటించే సినిమాల్లోనూ పృథ్వీకి ఛాన్స్‌లు రావడం లేదనే ప్రచారం కూడా సాగింది. దీంతో టాలీవుడ్‌లో పృథ్వీ కెరీర్ ఇక ముగిసినట్టు అనే పుకార్లు కూడా షికారు చేశాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమాలో నటించిన పృథ్వీ... ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చి మెగాస్టార్‌కు ఆకాశానికెత్తేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.

sye raa pre release event,sye raa narasimha reddy pre release event,sye raa pre release business,sye raa pre release,sye raa pre release event live,sye raa pre release event chief guest,sye raa narasimha reddy pre release event live,sye raa nara simha reddy pre release event venue fix,sye raa pre release date,sye raa pre release function,syeraa pre release event venue,సైరా నరసింహారెడ్డి,మెగాస్టార్ చిరంజీవి,సైరా మూవీ,సైరా ప్రీ రిలిజ్ ఫంక్షన్,సైరా లేటెస్ట్ న్యూస్,30 ఇయర్స్ పృథ్వీరాజ్,చిరంజీవిపై 30 ఇయర్స్ పృథ్వీ కామెంట్స్,చిరంజీవిపై పృథ్వీ రాజ్ ప్రశంసలు,
సైరా నరసింహారెడ్డి ప్రీ రిలిజ్ ఫంక్షన్‌లో మాట్లాడుతున్న 30 ఇయర్స్ పృథ్వీ


మిగతా స్టార్స్ చిరంజీవిని పొగడటంలో ఆశ్చర్యమేమీ లేకపోయినా... పృథ్వీ చిరంజీవిని పొగడటం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. పృథ్వీ మాటలు విన్న చాలామంది ఆయన ఏపీ సీఎం జగన్‌తో పాటు మెగా ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోందని చర్చించుకుంటున్నారు. మొత్తానికి సీఎం జగన్ కోసం టాలీవుడ్‌పై పొలిటికల్ ఎటాక్ చేసిన థర్టీ ఇయర్స్ పృథ్వీ... తాజాగా తన తీరు మార్చుకున్నట్టు టాక్ వినిపిస్తోంది.First published: September 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading