కేసీఆర్ బయోపిక్‌లో ఉండే రాజకీయ నేతలు వీళ్లే... మరికాసేపట్లో ఫస్ట్ లుక్

వర్మ కేసీఆర్ బయోపిక్

'టైగర్ కేసీఆర్' లోని ఓ సాంగ్ లిరిక్స్ ను రామ్ గోపాల్ వర్మ స్వయంగా పాడుతూ వీడియో తీసి యూ ట్యూబ్ లో విడుదల చేశారు.

  • Share this:
    వివాదాస్పద డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ మరో సంచలనాత్మక సినిమా తీసేందుకు రెడీ అయ్యారు. లక్ష్మీఎస్ ఎన్టీఆర్ అనే పేరుతో ఎన్టీఆర్ బయోపిక్‌ను తీసిన వర్మ... కేసీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితంపై ‘టైగర్ కేసీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి వర్మ మరో కీలక ప్రకటన చేశారు. ఈ సినిమాలో కేసీఆర్‌తో పాటు ఎవరెవరు ఉంటారోనన్న మ్యాటర్ కూడా లీక్ చేశారు. కేసీఆర్‌తో పాటు కేటీఆర్, కవిత, హరీశ్ రావు, వైఎస్సార్, వైఎస్ జగన్, చంద్రబాబు, లగడపాటి రాజగోపాల్ ఉంటారని తెలిపాడు వర్మ. వీరితోపాటు వీరితో పాటు ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ సీఎంలు రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు, చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ కూడా ఉంటారన్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను మరికాసేపట్లో 11 గంటలకు విడుదల చేస్తానని వర్మ తెలిపారు.

    ఇప్పటికే వర్మ ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది." మా భాష మీద నవ్వినవ్... మా ముఖాల మీద ఊసినవ్... మా బాడీల మీద నడిసినవ్ ఆంధ్రోడా... వస్తున్నా... వస్తున్నా... మీ తాటతీయనీకి వస్తున్నా..." అంటూ 'టైగర్ కేసీఆర్' లోని ఓ సాంగ్ లిరిక్స్ ను రామ్ గోపాల్ వర్మ స్వయంగా పాడుతూ వీడియో తీసి యూ ట్యూబ్ లో విడుదల చేశారు.

    First published: