నేడు తెలంగాణలో రాహుల్, చంద్రబాబు, రాజ్‌నాథ్ ప్రచారాలు

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ రాకతో ప్రజాకూటమి కార్యకర్తల్లో ఎక్కడలేని ఉత్సాహం కనిపిస్తోంది. రాహుల్‌తో కలిసి చంద్రబాబు ప్రచారం చేస్తుండటంతో టీ-టీడీపీలో జోష్ పెరిగింది. ఇటు కేసీఆర్, అటు మోడీని టార్గెట్ చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు రాహుల్, చంద్రబాబు.

news18-telugu
Updated: November 29, 2018, 10:48 AM IST
నేడు తెలంగాణలో రాహుల్, చంద్రబాబు, రాజ్‌నాథ్ ప్రచారాలు
రాహుల్ గాంధీ
  • Share this:
జాతీయస్థాయి నేతల రాకలతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జోరు మరింత పెరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి తెలంగాణ గడ్డపై ప్రచారం ప్రారంభించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్... ఘాటైన వ్యాఖ్యలే చేశారు. ఢిల్లీలో ఉన్నది మోడీ ఏ అయితే, తెలంగాణలో ఉన్నది మోడీ బీ అంటూ పరోక్షంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. ప్రధానంగా టీఆర్ఎస్‌కి ఓటు వేస్తే, బీజేపీకి వేసినట్లే అనే కోణంలో రాహుల్ ప్రచారం సాగింది.

చంద్రబాబు సైతం తెలంగాణ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. తెలుగు రాష్ట్రాలు కలిసివున్నప్పుడు తాను చేసిన అభివృద్ధి పనులను వివరించారు. కేసీఆర్ ఎందుకు తనను టార్గెట్ చేస్తున్నారో చెప్పాలన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యడమే తన తప్పా అని నిలదీశారు. మొత్తంగా తెలంగాణలోని సీమాంధ్ర ప్రజలు, పార్టీ కార్యకర్తల్లో జోష్ కనిపించింది.

rahul gandhi kodangal, telangana elections, telangana election news, telangana polls, telangana assembly election
కొడంగల్ సభలో రాహుల్ గాంధీ


ఇవాళ రాహుల్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పర్యటించునున్నారు. పరిగిలో జరిగే ఎన్నికల బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఉదయం 10.30గంటల నుంచి సుమారు గంటపాటు హైదరాబాద్‌లో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు నిర్వహించే సమావేశంలో రాహుల్ పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత రోడ్ షోలో పాల్గొనేందుకు మధ్యాహ్నం 1గంటకు భూపాలపల్లి చేరి... అక్కడి నుంచీ 3:15కి ఆర్మూరు చేరుకుంటారు. సాయంత్రం 5:15కి పరిగి వెళ్లి రోడ్ షో ప్రారంభిస్తారు. సాయంత్రం 6:30కు చేవెళ్లలో ఇది ముగుస్తుంది. ఐతే చేవెళ్లలో సాయంత్రం జరగాల్సిన బహిరంగ సభ రద్దయింది. సమయం ఉంటే పరిగి నుంచి వచ్చేటప్పుడు మార్గం మధ్యలో ఆయన చేవెళ్లలో కొద్దిసేపు ఆగే అవకాశాలు ఉన్నాయని పార్టీవర్గాలు తెలిపాయి. ఇక్కడి నుంచి తిన్నగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరకుని ఢిల్లీ వెళతారు.

ఖమ్మం బహిరంగసభలో మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు
ఖమ్మం బహిరంగసభలో మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు


ఇక గ్రేటర్‌లో భాగమైన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైవు కూకట్‌పల్లి ప్రజాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసినికి మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ తలపెట్టిన రోడ్ షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కేటీఆర్ రోడ్ షో ఉన్నందున అనుమతివ్వలేమని పోలీసులు చెప్పారు. రోడ్ షో కోసం కేటీఆర్ ముందుగానే అనుమతులు తీసుకున్నారనీ, అందువల్లే చంద్రబాబు రోడ్ షోకు అనుమతి ఇవ్వలేదని మాదాపూర్ డీసీపీ చెప్పారు.

rajnadh singh comments on rahul gandhi
రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి


ఇవాళ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రాక
రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొంటున్నట్లు బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు పి.సుదర్శన్‌యాదవ్ తెలిపారు. ఇప్పటికే సభ స్థలాన్ని ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి సీఐ అర్జునయ్యతో పాటు పార్టీ నేతలు బి.పాపాయ్యగౌడ్, దేవేందర్‌రెడ్డి పరిశీలించి, అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయని వివరించారు.
Published by: Krishna Kumar N
First published: November 29, 2018, 7:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading