Home /News /politics /

TODAY ONWARDS SUPREME COURT TO HEAR AYODHYA DISPUTE CASE

సుప్రీంకోర్టులో నేడు అయోధ్య కేసు విచారణ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అయోధ్య రామమందిర నిర్మానం, బాబ్రీ మసీదుకు దాఖలైన కేసులకు సంబంధించి 2001ల అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. వివాదాస్పద 2.7 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డ్, నిర్మోహి అఖారా, రామలల్లా సంస్థలకు సమానంగా పంచాలని తీర్పులో పేర్కొంది.

    అయోధ్య రామమందిర నిర్మాణం, బాబ్రీ మసీదు వివదానికి సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. చీఫ్ జస్టీస్ రంజన్ గొగోయ్, ఎస్‌కే కౌల్‌లతో కూడిన ధర్మాసనం ఈ విచారణ నిర్వహిస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించిన హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా 14 అభ్యర్థనలు దాఖలైనందున ధర్మాసనంలోని జడ్జీల సంఖ్య మూడుకు చేర అవకాశాలు కనిపిస్తున్నాయి.

    అయోధ్య కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై జనవరి మొదటివారంలో విచారణ చేపడతామని. ఏ బెంచ్ విచారణ చేస్తుందో అప్పుడు చెబుతామని గతేడాది అక్టోబర్ 29న సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే కేసు ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ముందుగా విచారణ చేపట్టాలని అఖిల భారత హిందూ మహాసభ (ఏబీహెచ్ఎం) కోరినా కోర్టు అందుకు తిరస్కరించింది. అలాగే కేసును ఐదుగురు జడ్జీల విస్తృత ధర్మసనానికి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్‌ను ముగ్గురు జడ్జీల ధర్మాసనం 2:1 మెజార్టీతో సెప్టెంబర్ 27న తిరస్కరించింది.

    అయోధ్య రామమందిర నిర్మానం, బాబ్రీ మసీదుకు దాఖలైన కేసులకు సంబంధించి 2001ల అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. వివాదాస్పద 2.7 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డ్, నిర్మోహి అఖారా, రామలల్లా సంస్థలకు సమానంగా పంచాలని తీర్పులో పేర్కొంది. అయితే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే కేసు విచారణను మాత్రం జనవరి మొదటివారంలో ప్రారంభిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బెంచ్‌ను కూడా అప్పుడే నిర్ణయిస్తామని పేర్కొంది.

    సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూడకుండా రామమందిర నిర్మాణంపై వెంటనే ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆర్ఎస్ఎస్, హిందుత్వవాదులు, కొందరు బీజేపీ నేతలు కొంతకాలంగా ఆందోళనలు నిర్వహించారు. ప్రధాని మోదీపై ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. అయితే రామజన్మభూమి వివాదానికి సంబంధించిన న్యాయప్రక్రియ పూర్తయిన తర్వాతే ఆర్డినెన్స్ తీసుకురావాలా వద్ద అనేది నిర్ణయిస్తామని తాజాగా ప్రధాని ప్రకటించారు. దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టువిచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Ayodhya Ram Mandir, National News, Supreme Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు