రేపట్నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు... దిశా హత్యాచార ఘటనపై చర్చ

అయితే కొన్నికారణాల వల్ల బీఏసీ సమావేశం సోమవారానికి వాయిదా వేశారు. తొలుత దిశ హత్యోదంతంపై చర్చ అనంతరం ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమవుతుంది.

news18-telugu
Updated: December 8, 2019, 12:06 PM IST
రేపట్నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు... దిశా హత్యాచార ఘటనపై చర్చ
ఏపీ అసెంబ్లీ (ఫైల్ ఫోటో)
  • Share this:
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్ శీతాకాలం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి... కీలకమైన బిల్లులు సభలో ప్రవేశ పెట్టనున్నారు.. అధికార ప్రతిపక్ష పార్టీ లు అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం అయ్యాయి. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సుమారు 10 రోజులో జరిగే అవకాశం ఉంది. మొదటి రోజు సభ ప్రారంభం అయ్యాక క్వశ్చన్ అవర్ ముగిసాకా బీఏసీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నిరోజులు జరగాలి అనేది చర్చిస్తారు.

నామినేటెడ్‌ పదవులు, ప్రభుత్వ పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ... ప్రభుత్వం చేసిన చట్టంపై మరోసారి సభలో చర్చ జరుగుతుంది. సుమారు 20 అంశాలపై సభలో చర్చించ డాని కి ప్రభుత్వం రెడి అవుతోంది..పాఠశాల విద్యలో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టడం.. ప్రభుత్వ, ప్రైవేటుపాఠశాలలన్నింటిలోనూ తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేయడం వంటి 20అంశాలపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రభుత్వ వైఫల్యాలపై సభలో గట్టిగా నిలదీసేందుకు ప్రతిపక్ష టీడీపీ కూడా వ్యూహాలను సిద్ధం చేసుకుంది. 21 అంశాలు సభలో ప్రస్తావించాలని టీడీపీ నిర్ణయించింది. రాజధాని అమరావతి. ఇసుక ఇంగ్లీష్ మీడియం తో పాటు రాష్ట్రం లో శాంతి భద్రతల అంశాన్ని టీడీపీ ప్రస్తావిస్తూ చర్చ జరగాలని సూచిస్తుంది...
మొదటి రోజు దిశ హత్యాచారం పై చర్చ జరిగే అవకాశం ఉంది...ఏపీ ప్రభుత్వం కూడా మహిళలపై అత్యాచారాలు దాడులకు సంబంధించి కీలక చట్టం చేసే ఆలోచనలో ఉంది. ఇప్పటికే దీనిపై సీఎం జగన్ కొన్ని సూచనలు ఇచ్చారు..రాష్ట్రంలో ఎట్టి పరిస్థితి ల్లో శాంతి భద్రతల విషయం లో రాజీ పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో మహిళలు కు సంబంధించిన కీలక చట్టం చేసే ఆలోచన లో అసెంబ్లీ ఉంది..

ఇక ఈసారి అసెంబ్లీ సమావేశాలు రాజకీయంగా కూడా హీట్ పుట్టించనున్నాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ కి దూరంగా ఉన్నారు. మరి కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మరే ఆలోచన లో ఉన్నారు. మరో వైపు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు లో మాఫియా పెరిగింది అని సంచలన వ్యాఖ్యలు చేయడం సీఎం జగన్ సీరియస్ అవ్వడం జరిగిపోయాయి. దీంతో అసెంబ్లీ లో వీరి వైఖరి ఎలా ఉంటుంది అని చర్చ జరుగుతోంది. మొత్తానికి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వేడి పుట్టించేలా ఉన్నాయి మరోవైపు. ప్రభుత్వ వైఫల్యాపై సభలో గట్టిగా నిలదీసేందుకు టీడీపీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసి వ్యూహాలు రచిస్తోంది.
Published by: Sulthana Begum Shaik
First published: December 8, 2019, 11:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading