రేపు చర్చిలు, మసీదులపైనా దాడులు జరగొచ్చు: చంద్రబాబు హెచ్చరిక

‘కష్టకాలంలో పార్టీతో ఉన్న ఏ ఒక్కరినీ మరచిపోనూ. వారందరికీ ప్రత్యేక స్థానం కల్పిస్తాను.’ అని చంద్రబాబు నంద్యాల నాయకులకు భరోసా ఇచ్చారు.

news18-telugu
Updated: September 23, 2020, 8:37 PM IST
రేపు చర్చిలు, మసీదులపైనా దాడులు జరగొచ్చు: చంద్రబాబు హెచ్చరిక
చంద్రబాబు
  • Share this:
ప్రజల మనోభావాలతో జగన్మోహన్ రెడ్డి ఆటలాడుతున్నారని, దేవాలయం, మసీదు, చర్చి ఏదైనా.. ప్రజల నమ్మకాలను, సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో చంద్రబాబునాయుడు సమన్వయ సమావేశం నిర్వహించారు. టీటీడీ డిక్లరేషన్ పై వైసీపీ రాద్ధాంతం చేస్తోందని, హైందవ సంప్రదాయం ప్రకారం.. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్న సీఎం జగన్


‘వైసీపీ పాలన ఎలా ఉందంటే.. మనుషులను చంపినా అడగకూడదు, మానభంగాలు చేసినా అడగకూడదు, తప్పుడు కేసులు పెట్టినా ప్రశ్నించకూడదు, దేవాలయాలపై దాడులు చేసినా అడగకూడదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై మొదలు పెట్టిన దాడులను.. నేడు దేవాలయాలను ధ్వంసం చేసే పరిస్థితికి తీసుకువచ్చారు. రాష్ట్రంలోని చిన్నా పెద్దా దేవాలయాలతో పాటు.. శ్రీశైలం సహా తిరుపతి వరకు దేవాలయాల ప్రతిష్ట దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఓ బూతుల మంత్రి ఏకంగా రథం తగలబడితే పోయేదేముంది, ఆంజనేయ స్వామి విగ్రహం చేయి విరిగితే దేవుడికి ఏమైపోతుందంటూ మాట్లాడుతున్నారు. ఆ రోజు వెంకటేశ్వర స్వామి విషయంలో జరిగిన తప్పిదాలను అసెంబ్లీ సాక్షిగా హెచ్చరించాను. కానీ.. నేడు డిక్లరేషన్ విషయంలో రాద్దాంతం చేస్తున్నారు. దేవాలయం, మసీదు, చర్చి ఏదైనా కావచ్చు.. ప్రజల నమ్మకాలను, సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రజల మనోభావాలతో ఆడుకోవాలనేలా నేటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. నేను ముఖ్యమంత్రిని.. డిక్లరేషన్ ఎందుకివ్వాలి అనేలా మాట్లాడుతున్నారు. హైందవ సంప్రదాయం ప్రకారం.. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. భార్య ఉన్నపుడు భర్త మాత్రమే ఆలయ పూజల్లో పాల్గొనడం రాష్ట్రానికే అరిష్టం. టీడీపీ హయాంలో.. హైదరాబాద్ లాంటి ప్రాంతంలో మతసామరస్యాన్ని కాపాడాం. రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని అణచివేశాం. రౌడీయిజం, తీవ్రవాదాలను తొక్కిపెట్టి ప్రజల స్వేచ్ఛను కాపాడాం. జగన్మోహన్ రెడ్డికి ఏసు క్రీస్తు అంటే నమ్మకం ఉంది. కాబట్టి ఇంటిపై శిలువ చిహ్నం వేసుకున్నారు. నేను వెంకటేశ్వరస్వామిని నమ్ముతా. ముస్లింలు అంతా అల్లాను నమ్ముతారు. అది వారి వారి నమ్మకం. దాన్ని గౌరవించాలే తప్ప.. హేళన చేయడం తగదు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు.. తాడేపల్లిగూడెంలో ఓ చర్చిపై దాడి చేస్తే నేరుగా నేనే వచ్చి మరీ పరిస్థితిని సమీక్షించాను. ఇలాంటి తప్పులు పునరావృతమైతే క్షమించేది లేదని హెచ్చరించాను. అలాంటి తప్పులు జరగకుండా చూశాను. కానీ నేడు ఇన్ని దాడులు దౌర్జన్యాలు జరుగుతుంటే కనీసం నోరెత్తి మాట్లాడిన దాఖలాల్లేవు. ఈ రోజు దేవాలయాలపై జరిగిన దాడులు.. రేపు చర్చిలపైనా, మసీదులపైనా జరగొచ్చు. ’ అని చంద్రబాబు అన్నారు.

తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్న సీఎం జగన్


‘రాక్షస పాలన గురించి పురాణాల్లో విన్నాం, ఇప్పుడు ఏపీలో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇంతమంది ముఖ్యమంత్రులను చూశాం గానీ.. ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు. 5 శాతం ఓట్ల మార్పుతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. మరో 5 శాతం ఓట్లు టీడీపీకి వస్తే వైసీపీ అధికారంలోకి వచ్చేది కాదు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారో అందరూ చూస్తున్నాం. టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడులను ఎండగట్టాం, ఎస్సీలపై దాడులను ప్రశ్నించాం, ఎదురు నిలిచాం. చివరికి అచ్చెన్నాయుడు ఎలాంటి తప్పు చేయకపోయినా.. అక్రమ కేసుల్లో ఇరికించారు. కానీ.. నేడు మంత్రులే పేకాట ఆడిస్తున్నారు. ఇసుక, మద్యం, మట్టితో కూడా వ్యాపారం చేస్తున్నారు. నవరత్నాల పేరుతో సంక్షేమాన్ని నాశనం చేశారు. ఆ సంక్షేమ పథకాలను వాలంటీర్ల ద్వారా వారి పార్టీ వాళ్లకు మాత్రమే పరిమితం చేస్తున్నారు.’ అని చంద్రబాబు అన్నారు.

తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్న సీఎం జగన్


టీడీపీ హయాంలోనే అభివృద్ధి, సంక్షేమం‘పార్టీ కోసం కష్టబడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగేలా చేస్తాను. గతంలో రాష్ట్రం గురించి ఆలోచించి పార్టీని నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం. అమరావతి, పరిశ్రమలు, అభివృద్ధి, సంక్షేమం కోసం అనుక్షణం తాపత్రయపడ్డాను. కష్టకాలంలో పార్టీతో ఉన్న ఏ ఒక్కరినీ మరచిపోనూ. వారందరికీ ప్రత్యేక స్థానం కల్పిస్తాను.’ అని చంద్రబాబు నంద్యాల నాయకులకు భరోసా ఇచ్చారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 23, 2020, 8:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading