Home /News /politics /

TODAY MUNICIPAL COUNTING IN ANDHRA PRADESH ALL EYES ON KUPPAM RESULT IT IS BIG CHALLENGE TO CHANDRABABU NAIDU NGS

AP Municipal Result: కుప్పంలో గెలుపెవరది..? కౌంటింగ్ పై ఉత్కంఠ.. వైసీపీ వ్యూహం ఫలిస్తుందా..? చంద్రబాబు అనుభవం నెగ్గుతుందా..?

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

AP Municipal Result: కుప్పం సీటు ఎవరిది.. అక్కడ జరిగినవి సాధారణ అసెంబ్లీ ఎన్నికలు కావు అయినా అంతటి ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రా వ్యాప్తంగా పలు మున్సిపాలిటీల ఫలితం నేడు వెలువడనుంది.. కానీ అందరి ఫోకస్ కుప్పంపైనే ఉంది. కుప్పంలో క్లీన్ స్వీప్ చేసేందుకు అధికార వైసీపీ సర్వ శక్తులు ఒడ్డింది. అటు టీడీపీ కోసం కుప్పంలో వైసీపీ జెండా పాతితే.. భవిష్యత్తు కష్టమే అని భావించి తీవ్రంగా శ్రమించింది. దీంతో అక్కడి పరిస్థితి అసెంబ్లీ ఎన్నికలను తలపించింది. అందుకే ఈ ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది..

ఇంకా చదవండి ...
  Kuppam Election Results:  కుప్పం (Kuppam) నియోజకవర్గం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కు ఇకపై సేఫేనా..?  కాదా..? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు మళ్లీ కుప్పం నుంచి పోటీ చేస్తే గెలుస్తారా లేదా..? మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు  చంద్రబాబు కంచుకోటగా ఉన్న కుప్పంలో వైసీపీ (YCP) జెండా పాతుందా..? మంత్రి పెద్ది రెడ్డి  వర్సెస్ చంద్రబాబు (Minster peddyreddy vs Chandrababu naidu) గా సాగిన పోటీలో గెలిచేది ఎవరు? ఎవరి వ్యూహం వర్కౌట్ అవుతుంది.. ఈ ప్రశ్నలు అన్నింటికీ కాసేపట్లో సమాధానం దొరకనుంది. ఏపీ వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) కౌటింగ్ నేడు జరుగుతోంది. మెజార్గీ మున్సిపాలిటీలు వైసీపీ సొంతం అవుతుయన్నది అందరూ ఊహించిందే.. కానీ కుప్పంలో ఎలాంటి ఫలితం వస్తుంది అన్నదానిపైనే అందరు ఉత్కంఠ ఎదురు చూస్తున్నారు.

  2019 సాధారణ ఎన్నికల నుంచి నేటి వరకు స్పీడ్ గా వీస్తున్న ఫ్యాన్‌ హవాను తట్టుకొని సైకిల్ నిలపబడుతుందా అన్నది కుప్పం ఫలితంతో తేలిపోనుంది. మున్సిపల్ ఎన్నికను అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో జెండా పాతడానికి తోడు.. ఇక కుప్పం ఎంతమాత్రం బాబుకు సేఫ్ కాదని సంకేతాలు ఇవ్వాలనే లక్ష్యంతో వైసీపీ పావులు కదిపింది. ఇటు టీడీపీ సైతం కుప్పంలోనే టీడీపీ ఓడింది అంటే.. ఇంకెక్కడా గెలవలేదనే ముద్ర పడుతుందని.. ఇది 2024 ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందని టీడీపీ భావిస్తోంది. అందుకే రెండు పార్టీలు గెలుపు కోసం సర్వ శక్తులు ఒడ్డాయి..

  ఇదీ చదవండి : ఆ రెండు నగరాల్లో విస్తరించిన చైల్డ్ పోర్న్ రాకెట్.. దుండుగులను పట్టుకునేందుకు సీబీఐ ఫోకస్

  మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కుప్పంలో యుద్ధ వాతావారణం నెలకొంది. దొంగ ఓటర్లు భారీగా పట్టు పడ్డాడు. వైసీపీ-టీడీపీ కార్యకర్తల మధ్య కుమ్ములాటలు జరిగాయి. పోటాపోటీ ఫిర్యాదులతో ఎవరూ వెనక్కు తగ్గలేదు. అధికార పార్టీ నుంచి కీలక మంత్రులు అంతా అక్కడే మకాం వేసి.. పోలింగ్ సరలిని దగ్గరుండి పర్యవేక్షించారు. ఇటు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇద్దరు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించారు. రెండు పార్టీల నేతల మధ్య ఓ రేంజ్‌ డైలాగ్‌ వార్‌ నడించింది. గెలుపు మాది అంటే మాది అంటూ తొడలు కొట్టారు. మరి నిజమైన గెలుపు ఎవరిది అన్నది కాసేపట్లో తేలిపోనుంది.

  ఇదీ చదవండి : చైన్ స్నాచింగ్ లో ఆరి తేరిన దొంగను పట్టించిన బైక్.. అసలు ఏం జరిగిందంటే..?

  కుప్పంలో ఓడిపోతారనే భయంతోనే అధికార వైసీపీ నేతలు దొంగఓట్లు వేయించారన్నది టీడీపీ ఆరోపణ. ఓటమి భయం కనపడుతోందని కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేతలు. కుప్పం టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాఖ కావడంతో అక్కడ తమ జెండా పాతాలని వైసీపీ భావించింది. తమ సొంత అడ్డ కాబట్టి మున్సిపల్ విజయం తమదే కావాలని టీడీపీ పట్టుదలకు పోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

  ఇదీ చదవండి : వైజాగ్ ఎయిర్ పోర్టు నుంచి పౌర విమానాలు ఆపేయాలి..?మంత్రి బుగ్గన డిమాండ్.. కేంద్రం సమాధనం ఏంటి..?

  మొత్తం కుప్పంలోని 24 వార్డుల్లో 9 వార్డులను సమస్యాత్మకంగా గుర్తించిన పోలీసులు, అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే కుప్పంలో భారీగా దొంగ ఓటర్లు ఉన్నారని టీడీపీ కార్యకర్తలు ఆందోళనతో దిగడంతో కుప్పం రణరంగాన్ని తలపించింది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu naidu, Kuppam, Municipal Elections, Peddireddy Ramachandra Reddy

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు